ఈ వారమూ పసిడి, వెండి ధరలు తగ్గనున్నాయా?
ABN , Publish Date - Mar 23 , 2026 | 06:58 AM
భౌగోళిక రాజకీయ అనిశ్చితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వారం కూడా పసిడి, వెండి ధరలు తిరోగమనంలో సాగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక హైదరాబాద్‌లో ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయంటే..
ఇంటర్నెట్ డెస్క్: గత వారం భారత్‌లో బంగారం, వెండి ధరలు తిరోగమనంలో పయనించాయి. పసిడి ధరల్లో దాదాపు 11 శాతం మేర కోత పడింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు మొదలైన నాటి నుంచీ ధరలు తగ్గుతూనే ఉన్నాయి. ఈ వారం కూడా ఇదే ఒరవడి కనిపించవచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు (మార్చ్ 23) ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం స్పాట్ ధర రూ.1,45,960గా ఉంది. 22 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.1,33,790 వద్ద కొనసాగుతోంది. ఇక నగరంలో కిలో వెండి ధర రూ.2,49,900గా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధరలు తగ్గుతూనే ఉన్నాయి. దీంతో ఔన్స్ (31.10 గ్రాములు) బంగారం ధర 4 వేల డాలర్లకు చేరుతుందా? అన్న చర్చ కూడా మొదలైంది. గత వారం ఔన్స్ 24 క్యారెట్ పసిడి ధర 4,508 డాలర్ల వద్ద ముగిసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఔన్స్ వెండి 68 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇది 60 డాలర్లకు దిగివచ్చే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం ప్రధాన నగరాల్లో పసిడి (24కే, 22కే) ధరలు ఇవీ
చెన్నై: ₹1,48,570; ₹1,36,190;
ముంబై: ₹1,45,960; ₹1,33,790;
న్యూఢిల్లీ: ₹1,46,110; ₹1,33,940;
కోల్‌కతా: ₹1,45,960; ₹1,33,790;
బెంగళూరు: ₹1,45,960; ₹1,33,790;
హైదరాబాద్: ₹1,45,960; ₹1,33,790;
విజయవాడ: ₹1,45,960; ₹1,33,790;
కేరళ: ₹1,45,960; ₹1,33,790;
పుణె: ₹1,45,960; ₹1,33,790;
వడోదరా: ₹1,46,010; ₹1,33,840;
అహ్మదాబాద్: ₹1,46,010; ₹1,33,840;
వెండి (కిలో) ధరలు ఇవీ
చెన్నై: ₹2,49,900;
ముంబై: ₹2,44,900;
న్యూఢిల్లీ: ₹2,44,900;
కోల్‌కతా: ₹2,44,900;
బెంగళూరు: ₹2,44,900;
హైదరాబాద్: ₹2,49,900;
విజయవాడ: ₹2,49,900;
కేరళ: ₹2,49,900;
పుణె: ₹2,44,900;
వడోదరా: ₹2,44,900;
అహ్మదాబాద్: ₹2,44,900;
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
ఈ వార్తలూ చదవండి
ఎఫ్‌పీఐల అమ్మకాలు రూ.1.35 లక్షల కోట్లు