Share News

గోల్డ్ రేట్స్.. మళ్లీ డౌన్

ABN , Publish Date - Mar 16 , 2026 | 10:23 AM

సోమవారం కూడా గోల్డ్ రేట్స్ మరింత తగ్గాయి. నేడు హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం

గోల్డ్ రేట్స్.. మళ్లీ డౌన్
Gold, Silver Rates On March 16

ఇంటర్నెట్ డెస్క్: బంగారం, వెండి ధరల్లో తిరోగమనం కొనసాగుతూనే ఉంది. గత కొన్ని రోజులుగా తగ్గుతున్న పసిడి ధరలు సోమవారం కూడా స్వల్పంగా తగ్గాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు (మార్చ్ 16) ఉదయం 10.00 గంటల సమయంలో హైదరాబాద్‌ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.490ల మేర తగ్గి రూ.1,59,170కు చేరుకుంది. ఇక 22 క్యారెట్ పసిడి ధర కూడా రూ.450 మేర తగ్గింది. ప్రస్తుతం 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,45,900గా ఉంది. నగరంలో వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,79,900గా ఉంది. విజయవాడలో కూడా దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి (Gold, Silver Rates on March 16).


ఇక దేశవ్యాప్తంగా ఇతర నగరాల్లో మేలిమి బంగారం ధర సగటున రూ.490ల మేర తగ్గింది. వెండి ధరలో రూ.5 వేల మేర కోత పడింది. చెన్నైలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర అత్యధికంగా రూ.1,61,010గా ఉంది. ముంబై, కోల్‌కతా, బెంగళూరు నగరాల్లో మేలిమి బంగారం ధర రూ.1,59,170గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ గోల్డ్ ధర రూ.1,47,590 కాగా, ముంబైలో కోల్‌కతా, బెంగళూరు నగరాల్లో రూ.1,45,900గా ఉంది.

చెన్నైలో కిలో వెండి ధర రూ.2,79,900గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్‌‌కతా, బెంగళూరు తదితర నగరాల్లో రూ.2.7 లక్షల వద్ద కొనసాగుతోంది. ఇన్వెస్టర్లు డాలర్‌పై పెట్టుబడులకు మొగ్గు చూపుతుండటంతో పసిడి, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయని మార్కెట్ పరిశీలకులు అంటున్నారు.


గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. వార్త రాస్తున్న సమయానికి ధరల వివరాలు పైన తెలిపిన విధంగా ఉన్నాయి. కాబట్టి బంగారం కొనుగోలు చేసే ముందు.. ధరలు మళ్లీ ఒకసారి పరిశీలించుకోగలరు.

ఇవీ చదవండి:

మార్కెట్లకు ‘క్రూడ్‌’ షాక్‌

ఐపీఓల్లో పబ్లిక్‌కు మరిన్ని షేర్లు

Updated Date - Mar 16 , 2026 | 10:33 AM