పసిడి, వెండి ధరలు ఢమాల్!
ABN , Publish Date - Mar 23 , 2026 | 10:21 AM
పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో నేడు భారత్‌లో పసిడి, వెండి రేట్స్ భారీగా పతనమయ్యాయి. ప్రస్తుతం రేట్స్ ఎలా ఉన్నాయంటే..
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో నేడు బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. పసిడి ధర సగటున సుమారు రూ.6 వేల మేర, వెండి రూ.15 వేల మేర పడిపోయింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో నేడు ట్రేడింగ్ ఆరంభంలోనే ధరలు ఊహించని స్థాయిలో పతనమయ్యాయి. నాలుగు నెలల కనిష్ఠానికి చేరుకున్నాయి. (Gold, Silver Rates Crash on March 23).
గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు (మార్చ్ 23) ఉదయం 10.00 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ పది గ్రాముల బంగారం ధర రూ.1,40,020కు పడిపోయింది. నిన్నటి ముగింపుతో పోలిస్తే ఏకంగా రూ.5,950ల మేర పతనమైంది. ఇక ఆర్నమెంటల్ పసిడి ధర కూడా రూ.5,450ల మేర తగ్గి రూ.1,28,350కు చేరుకుంది. వెండి ధరలో కూడా ఏకంగా రూ.20 వేల మేర కోత పడింది. ప్రస్తుతం నగరంలో కిలో వెండి ధర రూ.2.3 లక్షలకు చేరుకుంది.
అంతర్జాతీయ మార్కెట్స్‌లో కూడా పసిడి ధరలు పతనమయ్యాయి. ప్రస్తుతం ఔన్స్ (31.10 గ్రాములు) మేలిమి బంగారం స్పాట్ ధర 2.5 శాతం మేర తగ్గి 4,372 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక వెండి 66 డాలర్ల వద్ద కొనసాగుతోంది. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా ఈక్విటీల్లో వస్తున్న నష్టాలను పూడ్చుకునేందుకు మదుపర్లు లోహాలపై పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఫలితంగా నేడు ధరలు భారీగా పతనమయ్యాయని అంటున్నారు.
ప్రధాన నగరాల్లో పసిడి (24కే, 22కే) ధరలు ఇవీ
చెన్నై: ₹1,41,280; ₹1,29,500;
ముంబై: ₹1,40,020; ₹1,28,350;
న్యూఢిల్లీ: ₹1,40,170; ₹1,28,500;
కోల్‌కతా: ₹1,40,020; ₹1,28,350;
బెంగళూరు: ₹1,40,020; ₹1,28,350;
హైదరాబాద్: ₹1,40,020; ₹1,28,350;
విజయవాడ: ₹1,40,020; ₹1,28,350;
కేరళ: ₹1,40,020; ₹1,28,350;
పుణె: ₹1,40,020; ₹1,28,350;
వడోదరా: ₹1,40,070; ₹1,28,400;
అహ్మదాబాద్: ₹1,40,070; ₹1,28,400;
వెండి (కిలో) ధరలు ఇవీ
చెన్నై: ₹2,35,000;
ముంబై: ₹2,30,000;
న్యూఢిల్లీ: ₹2,30,000;
కోల్‌కతా: ₹2,30,000;
బెంగళూరు: ₹2,30,000;
హైదరాబాద్: ₹2,30,000;
విజయవాడ: ₹2,30,000;
కేరళ: ₹2,30,000;
పుణె: ₹2,30,000;
వడోదరా: ₹2,30,000;
అహ్మదాబాద్: ₹2,30,000;
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
ఈ వార్తలూ చదవండి:
స్టాక్ మార్కెట్‌లో ప్రకంపనలు.. కుప్పకూలిన నిఫ్టీ, సెన్సెక్స్ సూచీలు
పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. రూ.1.35 లక్షల కోట్లకు చేరిన ఎఫ్‌పీఐల అమ్మకాలు