తగ్గనున్న పసిడి, వెండి దిగుమతుల ధర
ABN , Publish Date - Feb 05 , 2026 | 05:53 AM
బంగారం, వెండి దిగుమతిదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ రెండు లోహాల దిగుమతులకు ప్రామాణికంగా తీసుకునే కనీస అంచనా విలువ (నోషనల్ వాల్యూ)ను ప్రభుత్వం తగ్గించింది....
న్యూఢిల్లీ: బంగారం, వెండి దిగుమతిదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ రెండు లోహాల దిగుమతులకు ప్రామాణికంగా తీసుకునే కనీస అంచనా విలువ (నోషనల్ వాల్యూ)ను ప్రభుత్వం తగ్గించింది. దీంతో 10 గ్రాముల పసిడి దిగుమతికి ప్రామాణికంగా తీసుకునే నోషనల్ వాల్యూ 1,568 డాలర్ల నుంచి 1,518 డాలర్లకు తగ్గింది. కిలో వెండి నోషనల్ వాల్యూ కూడా 3,457 డాలర్ల నుంచి 2,657 డాలర్లకు తగ్గనుంది. బంగారం, వెండి కడ్డీలు, నాణేలు, బిస్కట్లకు మాత్రమే ఈ తగ్గింపు వర్తిస్తుంది. నగలు, వాటితో చేసిన వస్తువుల దిగుమతులకు ఈ తగ్గింపు వర్తించదు. అంతర్జాతీయ ధరలను బట్టి ప్రభుత్వం ప్రతి 15 రోజులకు ఒకసారి బంగారం, వెండి దిగుమతుల నోషనల్ వాల్యూని సవరిస్తుంది. ఈ నోషనల్ వాల్యూ ఆఽధారంగా ఈ దిగుమతి సుంకం విధిస్తారు.
ధరలు మళ్లీ పైకి..
విలువైన లోహాల ధరలు వరుసగా రెండో రోజు ఎగబాకాయి. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (99.9 శాతం స్వచ్ఛత) బంగారం ధర బుధవారం మరో రూ.7,400 పెరిగి రూ.1,65,100కు చేరింది. కిలో వెండి ఏకంగా రూ.14,300 పెరుగుదలతో రూ.2,98,300 పలికింది. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయంగా వీటి ధరలు పెరగడం ఇందుకు కారణమైంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్స్ (31.10 గ్రాములు) గోల్డ్ మళ్లీ 5,000 మైలురాయిని దాటేసింది. ఒక దశలో 100 డాలర్లకు పైగా పెరిగి 5,047 డాలర్ల స్థాయిలో ట్రేడైంది. వెండి 4.28 డాలర్లు ఎగబాకి 89.35 డాలర్లకు చేరుకుంది.
Also Read:
థాయ్ మసాజ్ ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా?
పానిక్ అటాక్‌ని ఎలా గుర్తించాలో తెలుసా?
For More Latest News