భగ్గుమన్న పసిడి ధర! ఆల్ టైమ్ గరిష్ఠానికి చేరిక
ABN , Publish Date - Jan 28 , 2026 | 04:29 PM
నేడు దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఒక్క రోజులోనే సుమారు రూ. 8 వేల మేర పసిడి ధర పెరిగింది. ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయంటే..
ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ అనిశ్చితులు ఇప్పట్లో సద్దుమణిగే సూచనలు లేకపోవడంతో బంగారం, వెండి ధరలు రోజుకో జీవితకాల గరిష్ఠాన్ని నమోదు చేస్తున్నాయి. తాజాగా నేడు (జనవరి 28) పసిడి ధర ఏకంగా రూ.8 వేల పెరిగింది. హైదరాబాద్‌లో ప్రస్తుతం 24 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.1,70,447ల ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరింది. ఇక 22 క్యారెట్ 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర కూడా దాదాపు ఇదే స్థాయిలో పెరిగి రూ.1,51,400ల గరిష్ఠాన్ని తాకింది. ఇక నగరంలో కిలో వెండి ధర కూడా ప్రస్తుతం రూ.3.75 లక్షల వద్ద తచ్చాడుతోంది (Gold, Silver Rates in Hyderabad Jan 28).
అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం, వెండి ధరలు చుక్కలనంటుతున్నాయి. ప్రస్తుతం ఔన్స్ (31.10 గ్రాములు) మేలిమి బంగారం ధర 5,296 డాలర్ల వద్ద తచ్చాడుతోంది. ఔన్స్ వెండి ధర కూడా 114 డాలర్ల ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి ఎగబాకింది. అంతర్జాతీయ అనిశ్చితులకు తోడు డాలర్ బలహీనపడటం కూడా ఈ లోహాల ధరలకు ఆజ్యం పోస్తున్నాయి.
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
ఇవీ చదవండి:
ఈయూతో వాణిజ్య ఒప్పందం.. ఫార్మాకు లాభం.. ఆటోకు కష్టం
నార్త్ బ్లాక్‌లో బడ్జెట్ హల్వా వేడుక.. వారంతా ఐదు రోజుల పాటు అక్కడే..