ఇవాళ భారీగా తగ్గిన బంగారం ధరలు.. నేటి పసిడి రేట్లు ఇవే!
ABN , Publish Date - Apr 02 , 2026 | 11:20 AM
నేడు బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ విలువ పుంజుకోవడం, ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను డాలర్ ఆధారిత ఆస్తుల వైపు మళ్లించడంతో పసిడి ధరలు దిగివచ్చాయి.
ఆంధ్రజ్యోతి, ఏప్రిల్ 2: నేడు బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ విలువ పుంజుకోవడం, ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను డాలర్ ఆధారిత ఆస్తుల వైపు మళ్లించడంతో పసిడి ధరలు దిగివచ్చాయి. ఏప్రిల్ 2, గురువారం నాడు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఏ మేరకు తగ్గాయో ఇప్పుడు చూద్దాం. దేశవ్యాప్తంగా 24 క్యారెట్ల బంగారంపై రూ. 1,530, అలాగే 22 క్యారెట్లపై రూ. 1,400 వరకు తగ్గుదల నమోదైంది.
నేటి బంగారం ధరల వివరాలు: 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు..
హైదరాబాద్: రూ. 1,51,420
విజయవాడ: రూ.1,51,420
విశాఖపట్నం: రూ. 1,51,420
ముంబై: రూ. 1,51,420
బెంగళూరు: రూ. 1,51,420
ఢిల్లీ: రూ.1,51,570
చెన్నై: రూ. 1,52,180
గమనిక: పైన పేర్కొన్న ధరలు సమాచారం కోసం మాత్రమే. స్థానిక పన్నులు, జీఎస్‌టీ మరియు తయారీ కూలీ (Making Charges) బట్టి మీ నగరంలోని జ్యువెలరీ షోరూమ్‌లలో ధరలు మారవచ్చు. పెట్టుబడి నిర్ణయాలకు ముందు నిపుణుల సలహా తీసుకోగలరు.
ఇవి కూడా చదవండి...
ప్రమాదవశాత్తు సంపులో పడి 8 నెలల పసికందు మృతి
రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్.. యువకుడిపై కత్తులతో దాడి
Read Latest Telangana News And Telugu News