యూఎస్-ఇరాన్ డీల్ ఎఫెక్ట్.. భారీగా పెరిగిన బంగారం ధరలు
ABN , Publish Date - Jun 15 , 2026 | 10:27 AM
అమెరికా-ఇరాన్ డీల్‌తో పశ్చిమాసియా ఉద్రిక్తతలకు చెక్ పడిన వేళ భారత్‌లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. రూ.1.50 లక్షల మార్కును దాటాయి. ప్రస్తుతం వివిధ నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..
ఇంటర్నెట్ డెస్క్: యూఎస్-ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందంతో పశ్చిమాసియా ఉద్రిక్తతలు సద్దుమణిగిన వేళ నేడు బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌తో పాటు భారత్‌లోనూ పసిడి ధరలు భారీగా పెరిగాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, భారత్‌లో నేడు (జూన్ 15) 10 గ్రాముల 24 క్యారెట్ల మేలిమి బంగారం సగటు ధర క్రితం ముగింపుతో పోలిస్తే ఏకంగా రూ.2,450ల మేర పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,250ల మేర ఎగబాకింది. 18 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.1,840ల మేర పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఉదయం 10.00 గంటల సమయంలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,51,530కు ఎగబాకింది. 22 క్యారెట్ల ధర రూ.1,38,900కు చేరింది. ఏపీ, తెలంగాణల్లోని ఇతర ప్రాంతాల్లో ధరలు దాదాపుగా ఇదే స్థాయిలో పెరిగాయి.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
చెన్నై | ₹1,53,490 | ₹1,40,700 | ₹1,18,000 |
ముంబై | ₹1,51,530 | ₹1,38,900 | ₹1,13,650 |
న్యూఢిల్లీ | ₹1,51,680 | ₹1,39,050 | ₹1,13,800 |
కోల్‌కతా | ₹1,51,530 | ₹1,38,900 | ₹1,13,650 |
బెంగళూరు | ₹1,51,530 | ₹1,38,900 | ₹1,13,650 |
వడోదరా | ₹1,51,580 | ₹1,38,950 | ₹1,13,700 |
లక్నో | ₹1,51,680 | ₹1,39,050 | ₹1,13,800 |
నాగ్‌పూర్ | ₹1,51,530 | ₹1,38,900 | ₹1,13,650 |
భోపాల్ | ₹1,51,580 | ₹1,38,950 | ₹1,13,700 |
గమనిక: బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి, నగలు కొనుగోలు చేసే సమయంలో మరోసారి ధరలను చెక్ చేసుకోవాలని సూచన
ఈ వార్తలనూ చదవండి:
సరికొత్త రికార్డుల వైపు స్టాక్ మార్కెట్లు