Share News

మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఈసారి ఎంతంటే..

ABN , Publish Date - May 14 , 2026 | 10:43 AM

భారత్‌లో మరోసారి బంగారం ధరలు పెరిగాయి. అంతర్జాతీయ అనిశ్చితులు కొనసాగుతున్న వేళ మరోసారి ధరల్లో పెరుగుదల కనిపించింది.

మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఈసారి ఎంతంటే..
Gold Prices Hike on May 14

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో నేడు (మే 14) కూడా బంగారం ధరలు పెరిగాయి. అంతర్జాతీయ అనిశ్చితులు కొనసాగుతున్న నేపథ్యంలో ధరల్లో మరోసారి పెరుగుదల కనిపించింది. బంగారం, వెండిపై దిగుమతుల సుంకాన్ని పెంచడంతో నిన్న ధరలు ఒక్కసారిగా చుక్కలనంటిన విషయం తెలిసిందే. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు ఉదయం 10.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,62,330కు చేరింది. క్రితం ముగింపుతో పోలిస్తే ధర రూ.330ల మేర పెరిగింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.300ల మేర పెరిగి రూ.1,48,800కు చేరుకుంది. నగరంలో కిలో వెండి ధర కూడా స్వల్పంగా పెరిగి రూ.3,20,100కు చేరింది.


దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో కూడా పసిడి ధరలు పెరిగాయి. చెన్నైలో ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,64,180కు పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,50,500కు చేరుకుంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,62,330గా, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,48,800గా ఉంది. న్యూఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,62,260గా, 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,48,950ల వద్ద కొనసాగుతోంది. ఇక దేశంలో వెండి ధరలు మాత్రం పది వేల రూపాయల మేర తగ్గాయి. చెన్నైలో గరిష్ఠంగా కిలో వెండి రూ.3.15 లక్షలు పలుకుతుండగా ఇతర నగరాల్లో రూ.3 లక్షలుగా ఉంది.


ఈ వార్తలనూ చదవండి:

బంగారం మరింత భారం

ఆర్‌బీఐ నుంచి ప్రభుత్వానికి భారీ డివిడెండ్‌!

Updated Date - May 14 , 2026 | 11:18 AM