అంచనాకు అందని రీతిలో బంగారం, వెండి ధరల్లో మార్పులు
ABN , Publish Date - May 20 , 2026 | 10:50 AM
భారత్‌లో పసిడి, వెండి ధరలు అనూహ్య రీతిలో మారుతున్నాయి. ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయంటే..
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో బంగారం, వెండి ధరలు అంచనాలకు అందని విధంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం పసిడి ధర తగ్గి, వెండి ధర స్థిరంగా ఉండగా ప్రస్తుతం సీన్ రివర్స్ అయ్యింది. నేడు దేశంలో బంగారం ధర పెరగ్గా, వెండి ధర మాత్రం అనూహ్యంగా తగ్గింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేటి (మే 20) ఉదయం 10.30 గంటల సమయంలో హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ఏకంగా రూ.1,310ల మేర పెరిగి రూ.1,58,350కు చేరింది. 22 క్యారెట్ల ఆర్నమెంటల్ పసిడి ధర రూ.1,200ల మేర పెరిగి రూ.1,45,150కు చేరుకుంది. కిలో వెండి ధర మాత్రం రూ.15 వేల మేర తగ్గి రూ.2.85 లక్షలకు దిగొచ్చింది (Gold, Silver Rates on May 20 in Hyderabad.
ఇక ఇతర నగరాల్లో బంగారం ధర సగటున రూ.1,260ల మేర పెరిగింది. కిలో వెండి ధర మాత్రం రూ.5 వేల మేర పడిపోయింది. ప్రస్తుతం ముంబైలో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.1,58,350గా, 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,45,150గా ఉంది. న్యూఢిల్లీలో మేలిమి పసిడి ధర రూ.1,58,500గా, ఆర్నమెంటల్ పసిడి ధర రూ.1,45,300గా ఉంది. ఇక దేశంలోని కొన్ని నగరాల్లో కిలో వెండి రూ.2.85 లక్షలుగా, మరికొన్ని చోట్ల రూ.2.80 లక్షలుగా ఉంది.
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.
భారత కార్పొరేట్ దిగ్గజాలకు షాక్.. టాప్ 100 నుంచి అవుట్