ఆగని రూపాయి పతనం
ABN , Publish Date - May 20 , 2026 | 05:54 AM
భారత కరెన్సీ రోజుకో సరికొత్త జీవితకాల కనిష్ఠానికి పతనమవుతోంది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం విలువ మంగళవారం 50 పైసలు క్షీణించి రూ.96.70 వద్ద ఆల్‌టైం రికార్డు కనిష్ఠ...
సరికొత్త కనిష్ఠానికి మారకం విలువ
50 పైసల నష్టంతో రూ.96.70కి
డాలర్-రూపీ ఎక్ఛేంజ్ రేటు
వరుసగా 8 రోజులుగా పతన బాటలోనే భారత కరెన్సీ
భారత కరెన్సీ రోజుకో సరికొత్త జీవితకాల కనిష్ఠానికి పతనమవుతోంది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం విలువ మంగళవారం 50 పైసలు క్షీణించి రూ.96.70 వద్ద ఆల్‌టైం రికార్డు కనిష్ఠ ముగింపును నమోదు చేసింది. రూపాయి నష్టపోవడం వరుసగా ఇది ఎనిమిదో రోజు. గడిచిన 8 ట్రేడింగ్ సెషన్లలో మన కరెన్సీ మారకం విలువ 248 పైసలు (2.64 శాతం) తగ్గింది. భగ్గుమంటున్న ముడి చమురు ధరలు, విదేశీ సంస్థాగత పెట్టుబడుల నిరవధిక ఉపసంహరణ, అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితుల కారణంగా డాలర్ బలపడుతుండటం ఇందుకు ప్రధాన కారణాలు. సోమవారం ట్రేడింగ్‌లోనూ డాలర్ రూపీ మారకం విలువ 39 పైసల నష్టంతో క్రితం రికార్డు కనిష్ఠం రూ.96.20 వద్ద ముగిసింది.
రూపాయిపై ఒత్తిడి కొనసాగనుందని, డాలర్‌తో మారకం విలువ మున్ముందు సెషన్లలో రూ.96-96.60 శ్రేణిలో కదలాడవచ్చని మిరే అసెట్ షేర్‌ఖాన్ రీసెర్చ్ అనలిస్ట్ అనూజ్ చౌదురి అన్నారు. కాగా, అంతర్జాతీయంగా ఆరు ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలర్ సూచీ 0.05 శాతం పెరిగి 99.24కి చేరింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో బ్రెంట్ ముడి చమురు బ్యారల్ ధర ఒక దశలో 110 డాలర్ల స్థాయిలో ట్రేడైంది.

ఇవి కూడా చదవండి..
గల్ఫ్ దేశాల విజ్ఞప్తితో ఇరాన్‌పై దాడి వాయిదా.. ట్రంప్ కీలక ప్రకటన
పాపం పాకిస్థాన్.. భారత్‌లో లేని ఎయిర్‌బేస్‌లపై దాడులు చేసిందట..