భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..
ABN , Publish Date - Apr 01 , 2026 | 10:42 AM
కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి రోజే పసిడి ప్రియులకు షాక్ తగిలింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూల పరిస్థితులు, పెరిగిన డిమాండ్ కారణంగా హైదరాబాద్ నగరంలో బంగారం ధరలు ఈ రోజు భారీగా పెరిగాయి.
అంతర్జాతీయంగా డాలర్ విలువలో మార్పులు, సెంట్రల్ బ్యాంకుల వద్ద ఉన్న గోల్డ్ రిజర్వ్ పాలసీల ప్రభావం నేరుగా మన దేశీ మార్కెట్లపై పడింది. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త బడ్జెట్ నిబంధనలు అమలులోకి రావడం, దిగుమతి సుంకాలపై స్పష్టత రావడం కూడా ధరల పెరుగుదలకు ఒక కారణంగా కనిపిస్తోంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం 10 గ్రాములకు (24 క్యారెట్, 22 క్యారెట్) ధరలు వరుసగా ఇలా ఉన్నాయి:
హైదరాబాద్‌లో రూ.1,51,480, రూ.1,38,850
విజయవాడలో రూ.1,51,480, రూ.1,38,850
ఢిల్లీలో రూ.1,51,630, రూ.1,39,000
ముంబైలో రూ.1,51,480, రూ.1,38,850
చెన్నైలో రూ.1,53,270, రూ.1,40,050
బెంగళూరులో రూ.1,51,480, రూ.1,38,850
కేరళలో రూ.1,51,480, రూ.1,38,850
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)
హైదరాబాద్‌లో రూ.2,65,000
విజయవాడలో రూ.2,65,000
చెన్నైలో రూ.2,65,000
ముంబైలో రూ.2,55,000
బెంగళూరులో రూ.2,55,000
ఇవి కూడా చదవండి..
ఇరాన్ అణు కేంద్రక నగరంపై అమెరికా దాడులు.. వీడియో షేర్ చేసిన ట్రంప్..
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రతిపాదించిన సంచలన ప్రణాళిక