Share News

గోల్డ్, సిల్వర్ రేట్స్.. నేడు ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - Apr 25 , 2026 | 07:03 AM

పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో పసిడి, వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ప్రస్తుతం దేశంలోని వివిధ నగరాల్లో రేట్స్ ఎలా ఉన్నాయంటే.

గోల్డ్, సిల్వర్ రేట్స్.. నేడు ఎలా ఉన్నాయంటే..
Gold, Silver Rates on April 25

ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో బంగారం ధరలు కూడా అంచనాలకు అందని స్థాయిలో మారుతున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు (ఏప్రిల్ 25) ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి స్పాట్ ధర రూ.1,54,050గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,210కు చేరింది. ప్రస్తుతం నగరంలో కిలో వెండి ధర రూ.2,64,900గా ఉంది. విజయవాడలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,54,030ల వద్ద, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,41,190ల వద్ద కొనసాగుతోంది. వెండి (కిలో) ధర రూ.2,64,000గా ఉంది.


ఢిల్లీలో ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,54,200గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,41,360ల వద్ద కదలాడుతోంది. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,050గా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,41,210గా ఉంది. వెండి ధర విషయానికి వస్తే ఢిల్లీలో కిలో వెండి రూ.2,59,900గా ఉంది. ముంబైలో రూ.2,59,800 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో 24 క్యారెట్ల ఔన్స్ (31.10 గ్రాములు) బంగారం ధర 4,709 డాలర్లుగా, ఔన్స్ వెండి 75 డాలర్లుగా ఉంది.


గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.

ఈ వార్తలనూ చదవండి:

రిలయన్స్‌కు యుద్ధం సెగ.. లాభాల్లో క్షీణత

టెలికాం రంగ ఆదాయం రూ.3.72 లక్షల కోట్లు

Updated Date - Apr 25 , 2026 | 07:54 AM