Share News

బంగారం ధరల యూటర్న్.. ఎంత తగ్గాయంటే..

ABN , Publish Date - May 22 , 2026 | 11:15 AM

భారత్‌లో నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా వెండి ధరలు మాత్రం ఓ మోస్తరు స్థాయిలో పెరిగాయి. ప్రస్తుతం వివిధ నగరాల్లో రేట్స్ ఎలా ఉన్నాయంటే..

బంగారం ధరల యూటర్న్.. ఎంత తగ్గాయంటే..
Gold, Silver Rates on May 22 in India

ఇంటర్నెట్ డెస్క్: గత కొన్ని రోజులుగా భారత్‌లో వరుసపెట్టి పెరిగిన బంగారం ధరలు నేడు కాస్త శాంతించాయి. వెండి ధరలు మాత్రం యథాప్రకారం మరోసారి పెరిగాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు (మే 22) ఉదయం 10.30 గంటల సమయంలో హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,59,490కు చేరింది. క్రితం ముగింపుతో పోలిస్తే ధర రూ.440ల మేర తగ్గింది. 22 క్యారెట్ల ఆర్నమెంటల్ పసిడి ధర కూడా రూ.400ల మేర తగ్గి రూ.1,46,200కు చేరుకుంది. వెండి (కిలో) ధర కూడా నిన్నటితో పోలిస్తే రూ.5 వేల మేర పెరిగి రూ.2.95 లక్షలకు చేరుకుంది. విజయవాడలో కూడా దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.


దేశంలోని ఇతర ప్రధాన నగరాల విషయానికి వస్తే చెన్నైలో ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,61,240గా ఉంది. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,47,800ల వద్ద కదలాడుతోంది. ముంబైలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,59,490గా, 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,46,200గా ఉంది. దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,59,640ల వద్ద, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,250ల వద్ద కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో వెండి (కిలో) ధరలు రూ.2.85 లక్షల నుంచి రూ.2.95 లక్షల మధ్య కదలాడుతున్నాయి.


ఈ వార్తలనూ చదవండి:

భారతీయుల్లో రియల్టీ, బంగారంపై తగ్గుతున్న మోజు

అరబిందో ఫార్మా లాభం రూ.921 కోట్లు

Updated Date - May 22 , 2026 | 11:50 AM