గోల్డ్ రేట్స్.. వివిధ నగరాల్లో ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Sep 07 , 2026 | 06:38 AM
గత వారంలో బంగారం ధరల్లో కోత పడింది. ఈ వారమూ హెచ్చుతగ్గులు తప్పవని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: గతవారం భారత్‌లో బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. వారం ప్రథమార్థంలో భారీగా తగ్గిన ధరలు ఆ తరువాత కాస్త పెరిగాయి. స్థూలంగా చూస్తే గత వారం ధరల్లో రూ.3 వేల పైచిలుకు మేర కోత పడింది. ఈ వారం కూడా ధరల ఊగిసలాట ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు బంగారం ధరలపై అధిక ప్రభావం చూపించే అవకాశం ఉంది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేటి (సెప్టెంబర్ 7) ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,790గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,41,890 వద్ద కొనసాగుతోంది. 18 క్యారెట్ల పసిడి ధర రూ.1,16,890 వద్ద ట్రేడవుతోంది. ఇక కిలో వెండి ధర రూ.2.54 లక్షలుగా ఉంది.
తెలంగాణలోని నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
వరంగల్ | ₹1,54,790 | ₹1,41,890 | ₹1,16,090 |
నిజామాబాద్ | ₹1,54,790 | ₹1,41,890 | ₹1,16,090 |
ఖమ్మం | ₹1,54,790 | ₹1,41,890 | ₹1,16,090 |
ఏపీలోని నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
విజయవాడ | ₹1,54,790 | ₹1,41,890 | ₹1,16,090 |
విశాఖపట్నం | ₹1,54,790 | ₹1,41,890 | ₹1,16,090 |
అమరావతి | ₹1,54,790 | ₹1,41,890 | ₹1,16,090 |
కాకినాడ | ₹1,54,790 | ₹1,41,890 | ₹1,16,090 |
తిరుపతి | ₹1,54,790 | ₹1,41,890 | ₹1,16,090 |
భారత్‌లోని ప్రధాన నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
చెన్నై | ₹1,56,660 | ₹1,43,600 | ₹1,21,300 |
ముంబై | ₹1,54,790 | ₹1,41,890 | ₹1,16,090 |
ఢిల్లీ | ₹1,54,940 | ₹1,42,040 | ₹1,16,240 |
కోల్‌కతా | ₹1,54,790 | ₹1,41,890 | ₹1,16,090 |
బెంగళూరు | ₹1,54,790 | ₹1,41,890 | ₹1,16,090 |
కేరళ | ₹1,54,790 | ₹1,41,890 | ₹1,16,090 |
పుణె | ₹1,54,790 | ₹1,41,890 | ₹1,16,090 |
వడోదరా | ₹1,54,840 | ₹1,41,940 | ₹1,16,140 |
గమనిక: పైన పేర్కొన్న ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి నగలు కొనుగోలు చేసే సమయంలో ధరలను మరోసారి చెక్ చేసుకోవాలని సూచన.
ఈ వార్తలనూ చదవండి:
ఈ వారం 11 ఐపీఓలు.. రూ.7,055 కోట్లు
గ్రామీణ మార్కెట్‌పై హ్యుండయ్ ఫోకస్