Share News

11 ఐపీఓలు.. రూ.7,055 కోట్లు

ABN , Publish Date - Sep 07 , 2026 | 04:58 AM

కంపెనీల తొలి పబ్లిక్‌ ఆఫరింగ్స్‌ (ఐపీఓ) జోరు కొనసాగుతోంది. ఇప్పటికే పలు కంపెనీలు ఐపీఓలకు రాగా ఈ వారంలో మరో 11 కంపెనీలు తమ ఇష్యూలతో ప్రాథమిక మార్కెట్లో సందడి చేయడానికి సిద్ధమయ్యాయి

11 ఐపీఓలు.. రూ.7,055 కోట్లు
IPO

న్యూఢిల్లీ: కంపెనీల తొలి పబ్లిక్‌ ఆఫరింగ్స్‌ (ఐపీఓ) జోరు కొనసాగుతోంది. ఇప్పటికే పలు కంపెనీలు ఐపీఓలకు రాగా ఈ వారంలో మరో 11 కంపెనీలు తమ ఇష్యూలతో ప్రాథమిక మార్కెట్లో సందడి చేయడానికి సిద్ధమయ్యాయి. ఈ కంపెనీలు రూ.7,055 కోట్లు సమీకరించబోతున్నాయి. ఈ నెల 7 నుంచి 15వ తేదీల మధ్య ఈ ఐపీఓలు మార్కెట్లో ఉండనున్నాయి. చాలా ఐపీఓల సబ్‌స్ర్కిప్షన్‌ మంగళ, బుధవారాల్లో ప్రారంభమవుతోంది. ఐపీఓలకు రానున్న కంపెనీల్లో రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌, ఇంజనీరింగ్‌ అండ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ కంపెనీలు, పేమెంట్స్‌ అండ్‌ ఐడెంటిటీ సొల్యూషన్స్‌ అందించే సంస్థ, స్పెషాలిటీ కెమికల్స్‌ తయారీ సంస్థ, ఒక ఆన్‌లైన్‌ రెంటల్‌ ప్లాట్‌ఫామ్‌ ఉన్నాయి. కొత్త ఐపీఓలతో ఈ ఏడాదిలో వచ్చిన ఐపీఓల సంఖ్య 75కు పెరగనుంది. ఆగస్టులో 23 ఇష్యూలు మార్కెట్లోకి వచ్చాయి.

ఈ నెల 7-10 మధ్య ప్రారంభమయ్యే ఐపీఓలు

కంపెనీ ప్రైస్‌బ్యాండ్‌

ప్రణవ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ రూ.118-124

కనోహర్‌ ఎలక్ర్టికల్స్‌ రూ.601-632

ప్రసోల్‌ కెమికల్స్‌ రూ.643-676

గ్లాస్‌వాల్‌ సిస్టమ్స్‌ (ఇండియా) రూ.172-182

రెంటోమోజో రూ.384-404

మణిపాల్‌ పేమెంట్‌ రూ.322-339

ఆర్సిల్‌ రూ.132-139

ఎల్‌సీసీ ప్రాజెక్ట్స్‌ రూ.139-146

కరమ్‌తారా ఇంజనీరింగ్‌ రూ.241-254

వీగాలాండ్‌ డెవలపర్స్‌ రూ.130-140

Updated Date - Sep 07 , 2026 | 04:58 AM