Share News

గోల్డ్ ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - Jun 15 , 2026 | 08:04 AM

భారత్‌లో గత వారం మొదట్లో తగ్గిన బంగారం ధరలు వారం చివర్లో మళ్లీ పెరగడం ప్రారంభించాయి. దీంతో ఈ వారం ధరల పయనం ఎటువైపు ఉంటుందో అన్న ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం దేశంలో వివిధ నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..

గోల్డ్ ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..
Gold Prices on Jun 15 in India

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌‌తో శాంతి ఒప్పందం కుదిరిందన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనతో పశ్చిమాసియా ఉద్రిక్తతలకు చెక్ పడింది. అంతకు కొన్ని రోజుల ముందే డీల్‌పై అంచనాలు పెరగడంతో బంగారం ధరలు క్రమంగా పెరగడం ప్రారంభించాయి. గత వారం మొదట్లో తగ్గిన బంగారం ధరలు వారం చివర్లో మళ్లీ పెరగడం ప్రారంభించాయి. దీంతో, ఈ వారం ధరల పయనం ఎటువైపు ఉంటుందో అన్న ఆసక్తి నెలకొంది.

గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు (జూన్ 15, సోమవారం) ఉదయం 7.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,070గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,36,640 వద్ద కొనసాగుతోంది. 18 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,11,800గా ఉంది. వరంగల్, నిజామాబాద్‌, ఖమ్మంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఏపీలోని విజయవాడలో ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,48,580గా ఉంది. 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,36,200గా ఉంది. వైజాగ్‌లో కూడా ఇవే రేట్స్ కనిపిస్తున్నాయి.


ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు..

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

చెన్నై

₹1,51,190

₹1,38,590

₹1,16,090

ఢిల్లీ

₹1,49,220

₹1,36,790

₹1,11,950

కోల్‌కతా

₹1,49,070

₹1,36,640

₹1,11,800

బెంగళూరు

₹1,49,120

₹1,36,690

₹1,11,800

వడోదరా

₹1,49,120

₹1,36,690

₹1,11,850

జైపూర్

₹1,49,220

₹1,36,790

₹1,11,950

మదురై

₹1,51,190

₹1,38,590

₹1,16,090

అయోధ్య

₹1,49,220

₹1,36,790

₹1,11,950

గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి, నగలు కొనుగోలు చేసే సమయంలో ధరలను మరోసారి చెక్ చేసుకోవాలని సూచన


ఈ వార్తలనూ చదవండి:

ఎన్‌ఎస్ఈ నుంచి బాహుబలి ఐపీఓ

ఆచితూచి వ్యవహరించండి.. స్టాక్ మార్కెట్ నిపుణుల సూచన

Updated Date - Jun 15 , 2026 | 09:08 AM