Share News

వచ్చే 12-15 నెలల్లో... బంగారం @ రూ.1.93 లక్షలు!

ABN , Publish Date - Aug 11 , 2026 | 03:59 AM

అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో బంగారం ధరలకున్న సంబంధం మారుతోందని.. ద్రవ్యోల్బణం, సెంట్రల్‌ బ్యాంకుల ద్రవ్యపరపతి విధానాలు బులియన్‌ ధరలకు ప్రధాన చోదకంగా...

వచ్చే 12-15 నెలల్లో... బంగారం @ రూ.1.93 లక్షలు!

మోతీలాల్‌ ఓస్వాల్‌ అంచనా

న్యూఢిల్లీ: అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో బంగారం ధరలకున్న సంబంధం మారుతోందని.. ద్రవ్యోల్బణం, సెంట్రల్‌ బ్యాంకుల ద్రవ్యపరపతి విధానాలు బులియన్‌ ధరలకు ప్రధాన చోదకంగా మారుతున్నాయి. మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఎంఓఎ్‌ఫఎ్‌సఎల్‌) తాజా నివేదికలో ఈ విషయాన్ని ప్రస్తావించింది. ఈ ఏడాది ప్రథమార్ధం ట్రెండ్‌ను బట్టి చూస్తే, కేవలం భౌగోళిక రాజకీయ ముప్పులు మాత్రమే పసిడి ర్యాలీని ముందుకు నడిపించలేవని.. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లపై ఆ ఉద్రిక్తతలు ఏ మేర ప్రభావం చూపుతాయనే విషయాన్ని ఇన్వెస్టర్లు నిశితంగా గమనిస్తున్నారని పేర్కొంది.

మున్ముందు ఆ మూడే కీలకం

ద్రవ్యోల్బణం ట్రెండ్‌, ప్రామాణిక వడ్డీ రేట్లపై అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ సంకేతాలు, ప్రపంచ మార్కెట్లలో ద్రవ్య లభ్యత మున్ముందు బంగారం, వెండి ధరలకు ప్రధాన చోదకం కానున్నాయని ఎంఓఎ్‌ఫఎ్‌సఎల్‌ రిపోర్టు అభిప్రాయపడింది. అలాగే, సెంట్రల్‌ బ్యాంకు ల పసిడి కొనుగోళ్లు, గోల్డ్‌, సిల్వర్‌ ఎక్చేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్ల (ఈటీఎ్‌ఫ)లోకి పెట్టుబడుల ప్రవాహం, స్పెక్యులేషన్‌ కూడా బులియన్‌ ర్యాలీకి దోహదపడవచ్చని అంటోంది. స్వల్పకాలికంగా చూస్తే, బులియన్‌ ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు కొనసాగనున్నప్పటికీ, సంస్థాగత డిమాండ్‌ దీర్ఘకాలిక డిమాండ్‌కు మద్దతివ్వనుందని ఎంఓఎ్‌ఫఎ్‌సఎల్‌ కమోడిటీ అనలిస్ట్‌ మానవ్‌ మోడీ అన్నారు.

దీర్ఘకాలంలో పైపైకే..

మధ్యకాలికంగా చూస్తే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ప్రస్తుత స్థాయి నుంచి 6-8 శాతం మేర తగ్గే అవకాశాలున్నప్పటికీ మళ్లీ ఔన్స్‌ ధర 4,800 డాలర్ల దిశగా పయనించవచ్చని.. వచ్చే 12-15 నెలల్లో 5,500 డాలర్లకు ఎగబాకవచ్చని మోతీలాల్‌ ఓస్వాల్‌ అంచనా వేసింది. దేశీయ మార్కెట్లో 10 గ్రాముల రేటు మధ్యకాలంలో రూ.1.68 లక్షల దిశగా పయనించి.. 12-15 నెలల్లో రూ.1.93 లక్షలకు ఎగబాకవచ్చని అంచనా.

ఇవి కూడా చదవండి:

ఫిట్‌నెస్‌ కోసం 17 కిలోలు తగ్గాడు.. సర్ఫరాజ్ ఖాన్‌ ఈసారైనా నిరూపించుకుంటాడా?

2027 వన్డే ప్రపంచకప్.. జట్టులో చేరేందుకు సిద్ధంగా ఉన్నా: భువనేశ్వర్ కుమార్

Updated Date - Aug 11 , 2026 | 05:42 AM