సరికొత్త గరిష్ఠానికి బంగారం
ABN , Publish Date - Jan 30 , 2026 | 06:17 AM
ఢిల్లీ మార్కెట్లో గురువారం 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.1.83 లక్షలు పలికింది. బుధవారంతో పోల్చితే ధర ఒక్క రోజే రూ.12,000 పెరిగింది.
ఒక్కరోజే రూ.12,000 పెరిగిన ధర
ఢిల్లీ మార్కెట్లో గురువారం 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.1.83 లక్షలు పలికింది. బుధవారంతో పోల్చితే ధర ఒక్క రోజే రూ.12,000 పెరిగింది. మంగళవారం బంగారం ధర రూ.1.71 లక్షల వద్ద ముగిసింది. బంగారం ధరలో ఇది కొత్త రికార్డు. కిలో వెండి ధర సైతం బుధవారంతో పోల్చితే రూ.19,500 పెరిగి రూ.4,04,500 పలికింది. 3 వరుస సెషన్లలో వెండి ధర రూ.67,500 పెరిగింది. ఈ జనవరిలో ఇప్పటివరకు వెండి ధర రూ. 1,65,500 పెరిగింది. డిసెంబరు చివరిలో కిలో వెండి ధర 2.39 లక్షలతో పోల్చితే ఈ 29 రోజుల్లో ధర 69.2ు దూసుకుపోయింది. ఇది శతాబ్దికి ఒక్కసారి మాత్రమే వచ్చే అవకాశమని, అందుకే ధరలు ఇలా దూసుకుపోతున్నాయని పీఎల్ క్యాపిటల్ డైరెక్టర్ సందీప్ అన్నారు.
ఇవి కూడా చదవండి..
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఫోన్ కెమెరా.. రెడ్ టేప్ ఎందుకు వేశారు..
యుద్ధ భయంతో తాత చేసిన పని.. 80 ఏళ్ల తర్వాత మనవడికి కలిసొచ్చింది..
Updated Date - Jan 29 , 2026 | 07:15 PM