Share News

బంగారం రూ.1.53 లక్షలు

ABN , Publish Date - Jan 21 , 2026 | 02:16 AM

బులియన్‌ మార్కెట్లో రికార్డుల హోరు కొనసాగుతోంది. బంగారం, వెండి ధరలు రేసుగుర్రాల్లా దూసుకుపోతున్నాయి. మంగళవారం ఢిల్లీ స్పాట్‌ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి...

బంగారం రూ.1.53 లక్షలు

ఒక్కరోజే రూ.5,100 పెరుగుదల

  • వెండిదీ అదే జోరు

  • రూ.20,400 పెరిగిన కేజీ సిల్వర్‌

  • రూ.3.23 లక్షలకు చేరిక

  • ‘బులియన్‌’లో ఆగని రికార్డుల హోరు

న్యూఢిల్లీ: బులియన్‌ మార్కెట్లో రికార్డుల హోరు కొనసాగుతోంది. బంగారం, వెండి ధరలు రేసుగుర్రాల్లా దూసుకుపోతున్నాయి. మంగళవారం ఢిల్లీ స్పాట్‌ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (24 క్యారట్స్‌) బంగారం ఏకంగా రూ.1,53,200కు చేరి సరికొత్త రికార్టు సృష్టించింది. సోమవారం ముగింపుతో పోలిస్తే ఇది రూ.5,100 ఎక్కువ. మరోవైపు వెండి ధర కూడా మరింత భగ్గుమంది. కిలో వెండి ధర రూ.20,400 పెరిగి రూ.3.23 లక్షలకు చేరి రికార్డు సృష్టించింది.

ఫ్యూచర్స్‌ మార్కెట్లోనూ అదే హవా: ఫ్యూచర్స్‌ మార్కెట్లోనూ బంగా రం, వెండి ధరలు పరుగులు తీస్తున్నాయి. మల్టీ కమోడిటీస్‌ ఎక్స్ఛేంజీ (ఎంసీఎక్స్‌)లో ఫిబ్రవరిలో డెలివరీ ఇచ్చే 10 గ్రాముల మేలిమి పసిడి ధర రూ.6,861 (4.7 శాతం) పెరిగి రూ.1,52,500 రికార్డు స్థాయికి చేరింది. కిలో వెండి ధర కూడా రూ.17,723 పెరుగుదలతో జీవితకాల గరిష్ఠ స్థాయి రూ.3,27,998కు చేరింది. గత రెండు రోజుల్లోనే ఎంసీఎక్స్‌లో కిలో వెండి ధర రూ.32,187 (11.18 శాతం) పెరగటం గమనార్హం. అంతర్జాతీయ ఫ్యూచర్స్‌ మార్కెట్లోనూ పసిడి, వెండి ధరలు సెగలు కక్కుతున్నాయి. ఫిబ్రవరిలో డెలివరీ ఇచ్చే ఔన్స్‌ (31.10 గ్రాములు) పసిడి ధర సోమవారంతో పోలిస్తే 147.5 డాలర్లు (3.21 శాతం) పెరిగి 4,742.17 డాలర్లకు చేరి సరికొత్త రికార్డు నమోదు చేసింది. మార్చిలో డెలివరీ ఇచ్చే ఔన్స్‌ వెండి ధరా 6.87 డాలర్ల (7.76 శాతం) లాభంతో 95.41 డాలర్ల రికార్డు స్థాయికి చేరింది.

ఇవీ చదవండి:

భారత్ వృద్ధి రేటు 7.3 శాతం.. ఐఎమ్ఎఫ్ అంచనా

మార్కెట్‌ను ముంచిన టారిఫ్‌ భయాలు

Updated Date - Jan 21 , 2026 | 05:59 AM