Share News

హాల్‌మార్కింగ్‌ రుసుము పెంపు

ABN , Publish Date - Sep 17 , 2026 | 05:05 AM

పండుగల సీజన్‌ ముందు బంగారు ఆభరణాలపై హాల్‌మార్కింగ్‌ చార్జీలను సవరిస్తూ బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌) కీలక నిర్ణయం తీసుకుంది...

హాల్‌మార్కింగ్‌ రుసుము పెంపు

ముంబై: పండుగల సీజన్‌ ముందు బంగారు ఆభరణాలపై హాల్‌మార్కింగ్‌ చార్జీలను సవరిస్తూ బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌) కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్కో బంగారు ఆభరణంపై హాల్‌మార్కింగ్‌ రుసుమును రూ.45 నుంచి రూ.75 (కనీస కన్‌సైన్‌మెంట్‌ చార్జీ రూ. 200)కి పెంచగా, వెండి ఆభరణాలపై రుసుమును మాత్రం రూ.35 (కనీస కన్‌సైన్‌మెంట్‌ చార్జీ రూ.150) వద్దే యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే తక్షణమే అమల్లోకి వచ్చిన ఈ నిర్ణయంపై ఆల్‌ ఇండియా జెమ్‌ అండ్‌ జ్యువెలరీ డొమెస్టిక్‌ కౌన్సిల్‌ (జీజేసీ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వినియోగదారుల విశ్వసనీయత కోసం హాల్‌మార్కింగ్‌కు తాము ఎప్పుడూ మద్దతిస్తామని, నియంత్రణల పేరుతో 67ు రుసుము పెంపు సమంజసం కాదని జీజేసీ చైర్మన్‌ రాజేష్‌ రోక్డే అన్నారు.

Also Read:

భారత సినీ రంగానికి అనంత్ నాగ్‌ సేవలు స్ఫూర్తిదాయకం: పవన్ కల్యాణ్

రుణాల మంజూరుపై బ్యాంకులు దృష్టి పెట్టాలి: సీఎం చంద్రబాబు

Updated Date - Sep 17 , 2026 | 05:06 AM