Share News

షాక్.. భారీగా పెరిగిన వెండి ధరలు.. తగ్గిన బంగారం రేటు..

ABN , Publish Date - Mar 02 , 2026 | 10:27 AM

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల ప్రభావంతో వెండి ధరలకు రెక్కలు వచ్చాయి. సోమవారం వెండి భారీ పెరుగుదల నమోదు చేసింది. కేజీకి రూ.35 వేల మేర పెరుగదల నమోదు చేసింది. మరోవైపు యుద్ధం కారణంగా గత రెండ్రోజులు పెరిగిన బంగారం ధర సోమవారం భారీగా తగ్గింది.

షాక్.. భారీగా పెరిగిన వెండి ధరలు.. తగ్గిన బంగారం రేటు..
gold and silver rates today

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల ప్రభావంతో వెండి ధరలకు రెక్కలు వచ్చాయి. సోమవారం వెండి భారీ పెరుగుదల నమోదు చేసింది. కేజీకి రూ.35 వేల మేర పెరిగింది. రానున్న కొద్ది రోజుల్లో కిలో వెండి ధర రూ.4 లక్షలకు చేరుకుంటుందని నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు యుద్ధం కారణంగా గత రెండ్రోజులు పెరిగిన బంగారం ధర సోమవారం భారీగా తగ్గింది (Gold prices).


ఈ రోజు (మార్చి 2న) ఉదయం 10:15 గంటల సమయంలో హైదారాబాద్ బులియన్ మార్కె‌ట్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,69,800కు చేరుకుంది. నిన్నటి ధరతో పోల్చుకుంటే రూ.3,290 మేర తగ్గుదల నమోదు చేసింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,650 దగ్గర ఉంది (live gold rates). నిన్నటి ధరతో పోల్చుకుంటే రూ.3000 తగ్గింది.


ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,69,950కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,55,800కి చేరుకుంది. మరోవైపు వెండి ధర భారీ పెరుగుదల నమోదు చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.3.30 లక్షలుగా ఉంది నిన్నటితో పోల్చుకుంటే కిలోకు ఏకంగా రూ.35 వేలు పెరిగింది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.3.15 లక్షలుగా ఉంది.

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.


ఇవి కూడా చదవండి..

కోల్‌కతాలో సంజూ వీర విహారం.. దాసోహమైన రికార్డులివే..


స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Mar 02 , 2026 | 10:27 AM