బంగారం, వెండి మరింత కిందకు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే
ABN , Publish Date - Mar 04 , 2026 | 10:37 AM
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల ప్రభావంతో మొదట్లో భారీగా పెరిగిన వెండి ధరలు మళ్లీ కిందకు దిగి వచ్చాయి. మంగళవారం తగ్గిన బంగారం, వెండి ధరలు బుధవారం కూడా అదే ధోరణిని కనబరిచాయి.
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల ప్రభావంతో మొదట్లో భారీగా పెరిగిన వెండి ధరలు మళ్లీ కిందకు దిగి వస్తున్నాయి. మంగళవారం తగ్గిన బంగారం, వెండి ధరలు బుధవారం కూడా అదే ధోరణిని కనబరిచాయి. వెండి కేజీకి రూ.10 వేల మేర తగ్గింది. మరోవైపు బంగారం ధర కూడా భారీగా తగ్గింది (Gold prices).
ఈ రోజు (మార్చి 4న) ఉదయం 10:30 గంటల సమయంలో హైదారాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,64,510కు చేరుకుంది. నిన్నటి ధరతో పోల్చుకుంటే దాదాపు రూ.3110 మేర తగ్గుదల నమోదు చేసింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,800 దగ్గర ఉంది (live gold rates). నిన్నటి ధరతో పోల్చుకుంటే రూ.2850 మేర తగ్గింది.
మరోవైపు వెండి కూడా భారీ తగ్గుదల నమోదు చేసింది. బుధవారం కిలోకు రూ.10 వేల మేర తగ్గింది. దీంతో తిరిగి మూడు లక్షల మార్క్ దిగువకు వచ్చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2.85 లక్షలుగా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2.95 లక్షలుగా ఉంది.
ఇవి కూడా చదవండి..
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
వామ్మో.. క్రీమ్ రోల్స్‌ను ఎలా తయారు చేస్తున్నారో చూడండి.. తినడానికే భయపడతారేమో..