Share News

Gold, Silver Rates Jan 2: పసిడి, వెండి ధరలు.. నేటి రేట్స్ ఇవీ

ABN , Publish Date - Jan 02 , 2026 | 06:53 AM

నూతన సంవత్సరం తొలి రోజున బంగారం, వెండి ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గుదులు మాత్రమే నమోదయ్యాయి. మరి ప్రస్తుతం రేట్స్ ఎలా ఉన్నాయంటే..

Gold, Silver Rates Jan 2: పసిడి, వెండి ధరలు.. నేటి రేట్స్ ఇవీ
Gold, Silver Rates Jan 2

ఇంటర్నెట్ డెస్క్: జనవరి 1న అనేక అంతర్జాతీయ మార్కెట్‌లకు సెలవు కావడంతో ట్రేడింగ్ నెమ్మదించింది. దీంతో బంగారం, వెండి ధరల్లో స్వల్ప మార్పులు మాత్రమే చోటుచేసుకున్నాయి. భారత మార్కెట్‌లో బంగారం ధర స్వల్పంగా పెరగ్గా, వెండి ధర కొద్దిగా తగ్గింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, శుక్రవారం ఉదయం 6.30 గంటల సమయంలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ. ప్రస్తుతం రూ.1,35,070గా ఉంది. ఇక 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,810కు చేరింది. వెండి ధరలో మాత్రం వరుసగా నాలుగో రోజూ తగ్గుదల కనిపించింది. నిన్న ఇదే సమయానికి ఉన్న రేటుతో పోలిస్తే కిలో వెండి ధర స్వల్పంగా తగ్గి రూ.2,37,900కు చేరుకుంది (Gold, Silver Prices on 2026 Jan 2).

గతేడాది ఇన్వెస్టర్లకు బంగారం, వెండి‌పై పెట్టుబడులు కళ్లు చెదిరే లాభాలను ఇచ్చిన విషయం తెలిసిందే. బంగారం ధర గతేడాది 80 శాతం మేర, వెండి 150 శాతం మేర పెరిగి అద్భుత రాబడులను ఇచ్చాయి. ఇక కొత్త ఏడాదిలో కూడా ధరల్లో ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 4,500 నుంచి 4,700 డాలర్ల మధ్య కదలాడే అవకాశం ఉందని పలు బ్యాంకులు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం అంరత్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర 4,353గా, ఔన్స్ వెండి రేటు 72 డాలర్లుగా ఉంది.


ప్రధాన నగరాల్లో 10 గ్రాముల పసిడి (24కే, 22కే, 18కే) ధరలు

  • చెన్నై: ₹1,36,130; ₹1,24,390; ₹1,03,740

  • ముంబై: ₹1,35,070; ₹1,23,810; ₹1,01,300

  • న్యూఢిల్లీ: ₹1,35,220; ₹1,23,960; ₹1,01,450

  • కోల్‌కతా: ₹1,35,070; ₹1,23,810; ₹1,01,300

  • బెంగళూరు: ₹1,35,070; ₹1,23,810; ₹1,01,300

  • హైదరాబాద్: ₹1,35,070; ₹1,23,810; ₹1,01,300

  • విజయవాడ: ₹1,35,070; ₹1,23,810; ₹1,01,300

  • కేరళ: ₹1,35,070; ₹1,23,810; ₹1,01,300

  • పుణె: ₹1,35,070; ₹1,23,810; ₹1,01,300

  • వడోదరా: ₹1,35,120; ₹1,23,860; ₹1,01,350

  • అహ్మదాబాద్: ₹1,35,120; ₹1,23,860; ₹1,01,350

వెండి (కిలో) ధరలు

  • చెన్నై: ₹2,55,900

  • ముంబై: ₹2,37,900

  • న్యూఢిల్లీ: ₹2,37,900

  • కోల్‌కతా: ₹2,37,900

  • బెంగళూరు: ₹2,37,900

  • హైదరాబాద్: ₹2,55,900

  • విజయవాడ: ₹2,55,900

  • కేరళ: ₹2,55,900

  • పుణె: ₹2,37,900

  • వడోదరా: ₹2,37,900

  • అహ్మదాబాద్: ₹2,37,900


గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు మార్కెట్లలో ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. కాబట్టి.. కొనుగోలుదారులు మరోసారి ధరలను పరిశీలించగలరు.

ఇవీ చదవండి:

అరబిందో చేతికి ఖండేల్వాల్‌

జీఆర్‌టీ సంక్రాంతి ఆఫర్లు

Updated Date - Jan 02 , 2026 | 07:01 AM