Share News

బంగారం ధరల యూటర్న్.. ప్రస్తుత రేట్స్ ఇవీ..

ABN , Publish Date - May 20 , 2026 | 06:52 AM

అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో బంగారం ధరలు అంచనాలకు అందని రీతిలో మారుతున్నాయి. ప్రస్తుతం దేశంలోని వివిధ నగరాల్లో రేట్స్ ఎలా ఉన్నాయంటే..

బంగారం ధరల యూటర్న్..  ప్రస్తుత రేట్స్ ఇవీ..
Gold, Silver Rates in India on May 20

ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో బంగారం ధరలు అంచనాలకు అందని రీతిలో మారుతున్నాయి. గత వారం ట్రెండ్‌ను కొనసాగిస్తూ ఈ వారం మొదట్లో తగ్గిన పసిడి ధరలు నిన్న మళ్లీ ఓ మోస్తరు స్థాయిలో పెరిగాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేటి (మే 20) ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,57,050గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,43,960ల వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.2,99,900గా ఉంది (Gold, Silver Rates in Hyderabad on May 20).


చెన్నైలో ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,62,230గా, 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,48,710గా ఉంది. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,57,050 వద్ద కొనసాగుతుండగా, 10 గ్రాముల ఆర్నమెంటల్ పసిడి ధర రూ.1,43,960గా ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.1,57,200గా, 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,43,960ల వద్ద కొనసాగుతోంది. వెండి ధరల్లో కూడా తిరోగమనం కనిపిస్తోంది. ప్రస్తుతం అన్ని నగరాల్లో కిలో వెండి ధర రూ.3 లక్షల దిగువకు చేరుకుంది. రూ.2.84 లక్షల నుంచి రూ.2.99 లక్షల మధ్య కదలాడుతోంది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ (31.10 గ్రాములు) 24 క్యారెట్ల పసిడి ధర 4,491 డాలర్లుగా ఉంది. ఔన్స్ వెండి 74 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.


గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.

ఆగని రూపాయి పతనం

భారత కార్పొరేట్ దిగ్గజాలకు షాక్.. టాప్‌ 100 నుంచి అవుట్‌

Updated Date - May 20 , 2026 | 07:36 AM