Share News

బంగారం, వెండి కొనాలనుకుంటున్నారా? నేడు ధరలు ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - May 18 , 2026 | 06:51 AM

గత వారం తీవ్ర హెచ్చుతగ్గులకులోనైన పసిడి, వెండి ధరలు ఈ వారమూ అదే పంథాలో కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి ప్రస్తుతం దేశంలో ధరలు ఎలా ఉన్నాయంటే..

బంగారం, వెండి కొనాలనుకుంటున్నారా? నేడు ధరలు ఎలా ఉన్నాయంటే..
Gold, Silver Rates on May 18

ఇంటర్నెట్ డెస్క్: గత వారం దిగుమతి సుంకాల పెంపు తరువాత అనూహ్యంగా పెరిగిన బంగారం, వెండి ధరలు ఆ తరువాత క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. వారం చివరి రెండు రోజుల్లోనే బంగారం ధరలో దాదాపు రూ.5 వేల మేర కోత పడింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు యథాతథంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వారమూ పసిడి, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు (మే 18) ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,56,920గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,43,840ల వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.2,89,900గా ఉంది.


చెన్నైలో ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,60,900గా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,47,490గా ఉంది. ముంబైలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,56,920ల వద్ద, 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,43,840ల వద్ద కొనసాగుతోంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ.1,57,070గా, ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,43,990గా ఉంది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ (31.10 గ్రాములు) 24 క్యారెట్ల పసిడి 4,497 డాలర్ల వద్ద, ఔన్స్ వెండి 74 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.


గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.

ఈ వార్తలనూ చదవండి:

నవంబరు వరకు హోర్ముజ్‌ గండం

మార్కెట్‌లో ఈ వారమూ ఆటోపోట్లు.. ఆచితూచి అడుగేయాలంటున్న నిపుణులు

Updated Date - May 18 , 2026 | 07:54 AM