Share News

భారీగా పెరిగిన పసిడి ధర.. ఎంతంటే..

ABN , Publish Date - Nov 27 , 2026 | 10:29 AM

బంగారానికి డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. నేడు భారత్‌లో మరోసారి పసిడి ధరలు భారీగా పెరిగాయి. వెండి ధర కూడా ఓ మోస్తరు స్థాయిలో ఎగబాకింది.

భారీగా పెరిగిన పసిడి ధర.. ఎంతంటే..
Gold, Siver Rates on 27, Nov, 2026

ఇంటర్నెట్ డెస్క్: బంగారానికి డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. నేడు భారత్‌లో మరోసారి పసిడి ధరలు భారీగా పెరిగాయి. వెండి ధర కూడా ఓ మోస్తరు స్థాయిలో ఎగబాకింది. దేశంలో మేలిమి బంగారం ధర నేడు రూ.1,750 మేర పెరగ్గా, వెండి ధర రూ.5 వేల మేర పెరిగింది. అయితే, వచ్చే నెలలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ ద్రవ్యపరపతి సమీక్ష సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో ధరలు హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు (Gold, Silver Rates on 27, Nov, 2026). గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేటి ఉదయం 10.00 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,26,550కు ఎగబాకింది. నిన్నటి ముగింపుతో పోలిస్తే రూ.1,750 మేర పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ పసిడి కూడా రూ.1,16,000కు చేరుకుంది. నగరంలో కిలో వెండి రూ.5 వేల మేర పెరిగి రూ.1.7 లక్షలకు చేరింది.


తెలంగాణలో పసిడి (10 గ్రాములు) ధరలు ఇలా

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

వరంగల్

₹1,26,550

₹1,16,000

₹94,910

నిజామాబాద్

₹1,26,550

₹1,16,000

₹94,910

ఖమ్మం

₹1,26,550

₹1,16,000

₹94,910


ఏపీలో పసిడి (10 గ్రాములు) ధరలు ఇలా

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

విజయవాడ

₹1,26,550

₹1,16,000

₹94,910

విశాఖపట్నం

₹1,26,550

₹1,16,000

₹94,910

అమరావతి

₹1,26,550

₹1,16,000

₹94,910

కాకినాడ

₹1,26,550

₹1,16,000

₹94,910

తిరుపతి

₹1,26,550

₹1,16,000

₹94,910


భారత్‌లోని ప్రధాన నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

చెన్నై

₹1,26,550

₹1,16,000

₹94,900

ముంబై

₹1,26,550

₹1,16,000

₹94,910

ఢిల్లీ

₹1,26,600

₹1,16,150

₹95,060

కోల్‌కతా

₹1,26,550

₹1,16,000

₹94,910

బెంగళూరు

₹1,26,550

₹1,16,000

₹94,910

కేరళ

₹1,26,550

₹1,16,000

₹94,910

పుణె

₹1,26,550

₹1,16,000

₹94,910

వడోదరా

₹1,26,600

₹1,16,050

₹94,960


గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదారులు మరోసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.

ఈ వార్తలనూ చదవండి:

అప్పుచేసి పండగ చేసుకున్నారు.. ఆర్‌బీఐ గణాంకాల్లో వెల్లడి

SAPలో లేఆఫ్స్? 10 వేల మంది తొలగింపుపై యోచన

Updated Date - Nov 27 , 2026 | 10:40 AM