Share News

గోల్డ్, సిల్వర్ రేట్స్.. నేడూ అదే ట్రెండ్

ABN , Publish Date - May 21 , 2026 | 10:48 AM

భారత్‌లో బంగారం, వెండి ధరలు నేడు ఒక మోస్తరు స్థాయిలో పెరిగాయి. ప్రస్తుతం వివిధ నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..

గోల్డ్, సిల్వర్ రేట్స్.. నేడూ అదే ట్రెండ్
Gold, Silver Rates on May 21 in India

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో గత కొన్ని రోజులుగా పెరుగుతున్న బంగారం ధర నేడూ అదే ట్రెండ్‌ను కొనసాగిస్తోంది. దేశంలో నేడు బంగారం ధరలు ఓ మోస్తరుస్థాయిలో పెరిగాయి. వెండి కూడా రూ.5 వేల మేర ఎగబాకింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు ఉదయం ( మే 21) 10.30 గంటల సమయంలో హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.490ల మేర పెరిగి రూ.1,59,930కు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి కూడా రూ.450ల మేర పెరిగి రూ.1,46,600కు చేరుకుంది. వెండి ధర రూ.5 వేల మేర పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి రూ.2.9లక్షలుగా ఉంది.


ఇతర నగరాల విషయానికి వస్తే చెన్నైలో ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,61,670కు పెరిగింది. 22 క్యారెట్ల ఆర్నమెంటల్ పసిడి ధర రూ.1,48,100గా ఉంది. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,930గా, 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,46,600గా ఉంది. దేశరాజధాని న్యూఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,60,230 వద్ద, ఆర్నమెంటల్ పసిడి ధర రూ.1,46,750 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రస్తుతం 24 క్యారెట్ల ఔన్స్ (31.10 గ్రాములు) పసిడి ధర 4,532 డాలర్ల వద్ద, ఔన్స్ వెండి ధర 75 డాలర్ల వద్ద కదలాడుతోంది.


గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ఈ నేపథ్యంలో కొనుగోలు చేసే ముందు ఒకసారి వీటి ధరలు పరిశీలించుకోవాలని సూచన.

ఈ వార్తలు కూడా చదవండి..

ఎఫ్‌ఎంసీజీకి చమురు గండం

డాక్టర్‌ రెడ్డీస్‌ సెమాగ్లుటైడ్‌ టాబ్లెట్లు

Updated Date - May 21 , 2026 | 10:54 AM