Share News

ఎఫ్‌ఎంసీజీకి చమురు గండం

ABN , Publish Date - May 21 , 2026 | 02:15 AM

ఫాస్ట్‌ మూవింగ్‌ కన్స్యూమర్‌ గూడ్స్‌(ఎ్‌ఫఎంసీజీ) రంగ కంపెనీలకు ముడి చమురు, వర్షాభావం భయం పట్టుకుంది. ముడి చమురు దిగుమతులకు ఎదురవుతున్న ఆటంకాలు...

ఎఫ్‌ఎంసీజీకి చమురు గండం

వణికిస్తున్న వరుణ భయం జూతగ్గనున్న వినియోగ వృద్ధి

న్యూఢిల్లీ: ఫాస్ట్‌ మూవింగ్‌ కన్స్యూమర్‌ గూడ్స్‌(ఎ్‌ఫఎంసీజీ) రంగ కంపెనీలకు ముడి చమురు, వర్షాభావం భయం పట్టుకుంది. ముడి చమురు దిగుమతులకు ఎదురవుతున్న ఆటంకాలు, పొంచి ఉన్న ఎల్‌నినోతో వరుణుడు పడకేస్తే ఈ ఆర్థిక సంవత్సరం (2026-27) ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల గిరాకీ కూడా మందగిస్తుందని ఆందోళన చెందుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో ఈ రంగం విక్రయాల పరిమాణంలో 4.5 శాతం వృద్ధి నమోదైంది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు మరింత ముదిరి, చమురు సెగ మరింత విజృంభించినా, వరుణుడు పూర్తిగా శీతకన్నేసినా, ఈ ఆర్థిక సంవత్సరం ఎఫ్‌ఎంసీజీ గిరాకీ మూడు నుంచి నాలుగు శాతం మించకపోవచ్చని ‘వరల్డ్‌ ప్యానెల్‌ బై న్యూమరేటర్‌ (గతంలో కాంటారా) అనే సంస్థ ఎఫ్‌ఎంసీజీ పల్స్‌ పేరుతో విడుదల చేసిన నివేదికలో తెలిపింది. ఒకవేళ ముడి చమురు ధర ప్రస్తుత స్థాయిలోనే కొనసాగితే మాత్రం ఎఫ్‌ఎంసీజీల అమ్మకాల పరిమాణం వృద్ధి రేటు నాలుగు నుంచి నాలుగున్నర శాతం మధ్య ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది.

వినియోగదారుల ప్రవర్తనలోనూ మార్పులు

ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో వినియోగదారుల కొనుగోళ్ల ప్రవర్తనలోనూ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని ఎఫ్‌ఎంసీజీ పల్స్‌ నివేదిక తెలిపింది. గతంలో లాగా ఎడాపెడా కొను

గోలు చేయకుండా అవసరం మేరకే సరిపెట్టుకునే వైఖరి పెరుగుతుందని అంచనా వేసింది. ఒకవేళ ముడి చమురు ధరలు ప్రస్తుత స్థాయి వద్దే స్థిరపడి, వర్షాభావం మరింత ఎక్కువగా లేకపోతే మాత్రం ఎఫ్‌ఎంసీజీ రంగం ఈ ఆర్థిక సంవత్సరంలోనూ ఐదు శాతం వరకు వృద్ధి రేటు నమోదు చేసే అవకాశం ఉందని తెలిపింది.


వంట గ్యాస్‌పై బాదుడుతోనూ..

గల్ఫ్‌ యుద్ధం నేపథ్యంలో ఏర్పడిన ఎల్‌పీజీ కష్టాలూ వినియోగదారుల ఆహార అలవాట్లను మార్చేస్తున్నట్టు ఎఫ్‌ఎంసీజీ పల్స్‌ తెలిపింది. వంట గ్యాస్‌ సమృద్ధిగా దొరక్కపోవడం, కంపెనీలు పదే పదే ధరలు పెంచేయడంతో ప్రజలు ఈజీ టు కుక్‌ లేదా వండాల్సిన ఆహార పదార్థాల తయారీపై విముఖత చూపిస్తున్నట్టు పేర్కొంది. కొన్ని కుటుంబాలైతే ప్రత్యేక వంటకాలు, చిరుతిళ్ల తయారీని పూర్తిగా పక్కన పెట్టేశాయట.

సిమెంట్‌ లాభాలకూ గండి : ఇక్రా

చమురు సెగ సిమెంట్‌ కంపెనీలనూ భయపెడుతోంది. పశ్చిమాసియాలో సంక్షోభంతో విద్యుత్‌, ఇంధన ధరలు, అమ్మకాల ఖర్చులు పెరిగిపోవడం కంపెనీలకు పెద్ద గుదిబండగా మారింది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో సిమెంట్‌ కంపెనీల లాభాలు, గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 10 నుంచి 15 శాతం తగ్గే ప్రమాదం ఉందని ప్రముఖ పరపతి రేటింగ్‌ సంస్థ ఇక్రా ఒక నివేదికలో పేర్కొంది. చమురు సెగతో సిమెంట్‌ కంపెనీల విద్యుత్‌, ఇంధన ఖర్చులు ఇప్పటికే 10-12 శాతం పెరిగిపోయాయి. అమ్మకాల ఖర్చులూ 6-8 శాతం పెరిగాయి. ఇందులో కొంత భారాన్ని వినియోగదారులకు బదిలీ చేసినా, కంపెనీల నిర్వహణ లాభం టన్నుకు 10 నుంచి 15 శాతం పడిపోతుందని ఇక్రా అంచనా. సిమెంట్‌ కంపెనీల నిర్వహణ ఖర్చుల్లో విద్యుత్‌, ఇంధనం, అమ్మకాల ఖర్చులే 50 నుంచి 55 శాతం వరకు ఉన్న విషయాన్ని గుర్తు చేసింది.

ఇవి కూడా చదవండి..

రెండు వందల అడుగుల ఎత్తులో నిలిచిపోయిన రోలర్ కోస్టర్.. షాకింగ్ వీడియో వైరల్..

చంద్రయాన్-3 మరో సంచలనం.. విక్రమ్ ల్యాండర్ కీలక ఆవిష్కరణ.

Updated Date - May 21 , 2026 | 02:15 AM