Share News

డాక్టర్‌ రెడ్డీస్‌ సెమాగ్లుటైడ్‌ టాబ్లెట్లు

ABN , Publish Date - May 21 , 2026 | 02:11 AM

హైదరాబాద్‌ ఫార్మా దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ లాబొరేటరీస్‌ డయాబెటీస్‌ నియంత్రణ ఔషధ విభాగంలో తన స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకుంటోంది. ఇందులో భాగంగా కంపెనీ కొత్తగా..

డాక్టర్‌ రెడ్డీస్‌ సెమాగ్లుటైడ్‌ టాబ్లెట్లు

భారత మార్కెట్లోకి విడుదల

న్యూఢిల్లీ: హైదరాబాద్‌ ఫార్మా దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ లాబొరేటరీస్‌ డయాబెటీస్‌ నియంత్రణ ఔషధ విభాగంలో తన స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకుంటోంది. ఇందులో భాగంగా కంపెనీ కొత్తగా టైప్‌ 2 డయాబెటీస్‌ నియంత్రణ కోసం నోటి ద్వారా తీసుకునే బయోసిమిలర్‌ సెమాగ్లుటైడ్‌ టాబ్లెట్లను దేశీయ మార్కెట్లోకి విడుదల చేస్తున్న ట్టు బుధవారం కంపెనీ ప్రకటించింది. ఒబెడా బ్రాండ్‌ పేరుతో కంపెనీ ఈ టాబ్లెట్లను తీసుకువచ్చింది. రక్తంలో చక్కెర తీవ్రతను బట్టి అవసరమైన డోసులో రోజుకు ఒక టాబ్లెట్‌ చొప్పున వాడితే సరిపోతుందని కంపెనీ తెలిపింది. 3ఎంజీ, 7ఎంజీ, 14ఎంజీ డోసు ల్లో లభించే ఒక టాబ్లెట్‌ ధరను వరుసగా రూ.99, రూ.135, రూ.225గా కంపెనీ నిర్ణయించింది. టైప్‌ 2 మధుమేహం ఉన్న పెద్ద వారిలో చక్కెర స్థాయిల నియంత్రణకు ఈ టాబ్లెట్లు చక్కగా దోహదం చేస్తాయని కంపెనీ తెలిపింది. డాక్టర్ల సిఫారసుపై మాత్ర మే ఈ బయోసిమిలర్‌ సెమాగ్లుటైడ్‌ టాబ్లెట్లు లభిస్తాయి. ఇటీవలే డాక్టర్‌ రెడ్డీస్‌ జెనరిక్‌ సెమాగ్లుటైడ్‌ ఇంజెక్షన్‌ను భారత్‌తోపాటు కెనడా మార్కెట్లలో విడుదల చేసింది. ఇప్పుడు కొత్తగా బయోసిమిలర్‌ సెమాగ్లుటైడ్‌ టాబ్లెట్లను మార్కెట్లోకి తెచ్చింది. దేశంలోని షుగర్‌ పేషెంట్లకు సమ్మకమైన సరఫరా, స్థిరమైన నాణ్యతతో కూడిన టాబ్లెట్లను అందించడానికి కట్టుబడి ఉన్నట్టు డాక్టర్‌ రెడ్డీస్‌ సీఈవో (గ్లోబల్‌ జెనరిక్స్‌) ఎంవీ రమణ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి..

రెండు వందల అడుగుల ఎత్తులో నిలిచిపోయిన రోలర్ కోస్టర్.. షాకింగ్ వీడియో వైరల్..

చంద్రయాన్-3 మరో సంచలనం.. విక్రమ్ ల్యాండర్ కీలక ఆవిష్కరణ.

Updated Date - May 21 , 2026 | 02:11 AM