ఈ వారం గోల్డ్ ధరలు మరింత పతనం కానున్నాయా?
ABN , Publish Date - Jun 08 , 2026 | 07:00 AM
పసిడి, వెండి ధరలు గత వారమంతా తిరోగమనంలోనే పయనించాయి. ఈ వారం కూడా ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయంటే..
గత వారమంతా బంగారం ధరలు తిరోగమనంలోనే పయనించాయి. వెండి ధరలు గత వారంలో కొన్ని రోజుల పాటు స్థిరంగా కొనసాగినా మిగిలిన రోజుల్లో పడిపోయాయి. అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో మదుపర్లు ఆచితూచి వ్యవహరిస్తుండటంతో బంగారం, వెండికి డిమాండ్ తగ్గింది. ఇక గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు (జూన్ 8) ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,720గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,39,990ల వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.2,69,000గా ఉంది. విజయవాడలో కూడా ఇవే రేట్స్ కొనసాగుతున్నాయి.
దేశవ్యాప్తంగా ఇతర నగరాల విషయానికి వస్తే చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,54,900గా, ముంబైలో రూ.1,52,720గా, న్యూఢిల్లీలో రూ.1,55,900గా ఉంది. 22 క్యారెట్ల ఆర్నమెంటల్ బంగారం ధర చెన్నైలో రూ.1,41,990 కాగా, ముంబైలో రూ.1,39,990ల వద్ద, న్యూఢిల్లీలో రూ.1,40,140ల వద్ద కొనసాగుతోంది. గత వారం దేశంలో మేలిమి బంగారం ధర సగటున రూ.1,56,220ల నుంచి రూ.1,52,730కు పడిపోగా, వెండి (కిలో) ధర రూ.2.8 లక్షల నుంచి రూ.2.64 లక్షలకు చేరుకుంది. ఈ వారం కూడా ఇదే ట్రెండ్ కొనసాగే ఛాన్స్ ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
దీర్ఘకాలిక పెట్టుబడి సాధనాలపై దృష్టి పెట్టాము: ఎల్ఐసీ సీఈఓ
ఆచితూచి అడుగేయండి.. ఇన్వెస్టర్లకు నిపుణులు సూచన