Deloitte India Report Gold: భారతీయులకు నగలూ కీలక ఆస్తే డెలాయిట్
ABN , Publish Date - Jan 08 , 2026 | 06:24 AM
దేశంలో బంగారం, ఆభరణాల కొనుగోళ్ల స్వరూపం మారుతోంది. గతంలో ఏదైనా పండగలు, పబ్బాల సమయంలో అలంకరణలు లేదా తమ...
న్యూఢిల్లీ: దేశంలో బంగారం, ఆభరణాల కొనుగోళ్ల స్వరూపం మారుతోంది. గతంలో ఏదైనా పండగలు, పబ్బాల సమయంలో అలంకరణలు లేదా తమ ఆర్థిక స్థాయి చూపించుకునేందుకు మాత్రమే వీటిని ఎక్కువగా కొనుగోలు చేసేవారు. ఇపుడు ఆస్తుల కల్పనలో భాగంగా కూడా వీటిని కొనుగోలు చేస్తున్నట్టు డెలాయెట్ ఇండియా ఒక నివేదికలో తెలిపింది. ప్రస్తుతం నూటికి 86 మంది ఆస్తుల కల్పనకు బంగారం, ఆభరణాలు కొనుగోలు ఉత్తమం అని భావిస్తున్నట్టు పేర్కొం ది. ఇది దాదాపు షేర్లు, మ్యూచువల్ ఫండ్ యూనిట్ల కొనుగోళ్లకు సమానం. వీటిని కొనేవారిలోనూ నూటికి 87 మంది ఆస్తుల కల్పన కోసమే కొంటున్నారు.
ఇవి కూడా చదవండి..
వెనెజువెలా మాజీ అధ్యక్షుడు మదురోకు గాయాలయ్యాయా.. వీడియో చూస్తే..
స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..