గోద్రెజ్ నుంచి మరో రెండు లిస్టెడ్ కంపెనీలు
ABN , Publish Date - Apr 23 , 2026 | 05:13 AM
వచ్చే ఐదేళ్లలో గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించనుంది. ఇందులో భాగంగా క్యాపిటల్, కెమికల్...
రూ.5 లక్షల కోట్లకు మార్కెట్ విలువ
ముంబై: వచ్చే ఐదేళ్లలో గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించనుంది. ఇందులో భాగంగా క్యాపిటల్, కెమికల్ వ్యాపారాల్లో ఉన్న కంపెనీల షేర్లను స్టాక్ ఎక్స్చేంజిల్లో లిస్టింగ్ చేయాలని భావిస్తోంది. దీంతో తమ గ్రూప్ కంపెనీల షేర్ల మార్కెట్ విలువ వచ్చే ఐదేళ్లలో రూ.5 లక్షల కోట్లకు చేరుతుందని త్వరలో గోద్రెజ్ ఇండస్ట్రీస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్న ఫిరోజ్‌షా గోద్రెజ్ చెప్పారు. కొత్తగా లిస్టు చేసే కంపెనీల వ్యాపారాల విస్తరణ కోసం వచ్చే ఐదేళ్లలో రూ.5,000 కోట్ల నుంచి రూ.7,000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టనున్నట్టు వెల్లడించారు. తమ గ్రూప్ నైతిక వ్యాపార విలువలకు లోబడే కొత్తగా లిస్టు చేసే కంపెనీలను లాభాల్లో నడపాలని భావిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఫిరోజ్‌షా గోద్రెజ్ గ్రూప్ కొత్త బ్రాండ్ ఐడెంటిటీని విడుదల చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
యాపిల్ కొత్త సారథి జాన్ టర్నెస్
హెచ్‌సీఎల్ టెక్ లాభం రూ.4,488 కోట్లు