లాభాల్లోకి జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్
ABN , Publish Date - May 29 , 2026 | 04:22 AM
జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ లాభాల్లోకి అడుగుపెట్టింది. గడచిన ఆర్థిక సంవత్సరం (2025-26) మార్చితో ముగిసిన త్రైమాసికం (క్యూ4)లో...
క్యూ4 లాభం రూ.400 కోట్లు
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ లాభాల్లోకి అడుగుపెట్టింది. గడచిన ఆర్థిక సంవత్సరం (2025-26) మార్చితో ముగిసిన త్రైమాసికం (క్యూ4)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.400.49 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.252.66 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. త్రైమాసిక సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం కూడా రూ.2,976.76 కోట్ల నుంచి రూ.4,042.90 కోట్లకు పెరిగినట్లు కంపెనీ వెల్లడించింది. కాగా మార్చితో ముగిసిన 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ రూ.15,200.75 కోట్ల మొత్తం ఆదాయంపై రూ.472 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ.10,835.89 కోట్లుగా ఉండగా రూ.817 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. దశాబ్దం తర్వాత కంపెనీ పూర్తి ఆర్థిక సంవత్సరానికి లాభాలు ప్రకటించటం ఇదే తొలిసారి కావటం విశేషం.
ఇవి కూడా చదవండి..
అతిథులకు వరుడి రిటర్న్ గిఫ్ట్.. రూ.34.6 కోట్ల బీమా కవరేజీ..
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే.