స్టీల్ మార్కెట్‌కు ‘యుద్ధ’ సెగ
ABN , Publish Date - Mar 09 , 2026 | 01:17 AM
గల్ఫ్ యుద్ధ ప్రభావం భారత్‌తో సహా అంతర్జాతీయ స్టీల్ మార్కెట్ పైనా పడుతుందని బిగ్‌మింట్ రీసెర్చ్ అనే సంస్థ తెలిపింది. యుద్ధానికి ముందు...
పెరగనున్న ధరలు!
న్యూఢిల్లీ: గల్ఫ్ యుద్ధ ప్రభావం భారత్‌తో సహా అంతర్జాతీయ స్టీల్ మార్కెట్ పైనా పడుతుందని బిగ్‌మింట్ రీసెర్చ్ అనే సంస్థ తెలిపింది. యుద్ధానికి ముందు బ్యారల్ 70 డాలర్ల వద్ద ఉన్న బ్రెంట్ గ్రేడ్ ముడి చమురు ధర ఇప్పటికే 90 డాలర్లకు చేరింది. ఈ యుద్ధానికి వెంటనే తెరపడకపోతే ఇది త్వరలో 100 నుంచి 120 డాలర్లకు చేరే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల అంచనా. దీనికి తోడు ఇప్పటిక నౌకా రవాణ చార్జీలు 40 శాతం వరకు పెరిగాయి. ఈ ప్రభావం స్టీల్ పరిశ్రమకు అవసరమైన ప్రధాన ముడి పదార్ధాలపైనా పడుతుందని పేర్కొంది. దీంతో దేశీయ స్టీల్ కంపెనీలు ధరలు పెంచక తప్పదని బిగ్‌మింట్ అంచనా. లేకపోతే పెరిగే ఖర్చులు తట్టుకోలేక స్టీల్ కంపెనీల అమ్మకాలు, లాభాలకూ గండి పడే ప్రమాదం ఉందని భావిస్తున్నారు.
ఈ వార్తలూ చదవండి:
బొగ్గులా నల్లగా దోశ.. రెస్టారెంట్ ప్రయోగం వైరల్
కుటుంబంతో సహా వచ్చి గర్ల్‌ఫ్రెండ్ ఇంటి ముందు వ్యక్తి డ్యాన్స్! ఎందుకో తెలిస్తే..