Share News

చిప్‌ల కొరత.. 2027 వరకు కొనసాగవచ్చు..

ABN , Publish Date - Mar 04 , 2026 | 01:20 AM

మెమొరీ చిప్‌ల ధరల పెరుగుదల అంతర్జాతీయ సమస్యగా మారిందని, ఎలకా్ట్రనిక్స్‌ పరిశ్రమపై గణనీయ ప్రభావం చూపుతోందని దక్షిణ కొరియా ఎలకా్ట్రనిక్స్‌ తయారీ దిగ్గజం...

చిప్‌ల కొరత.. 2027 వరకు కొనసాగవచ్చు..

సామ్‌సంగ్‌ ఆగ్నేయాసియా సీఈఓ జేబీ పార్క్‌

శాన్‌ఫ్రాన్సిస్కో: మెమొరీ చిప్‌ల ధరల పెరుగుదల అంతర్జాతీయ సమస్యగా మారిందని, ఎలకా్ట్రనిక్స్‌ పరిశ్రమపై గణనీయ ప్రభావం చూపుతోందని దక్షిణ కొరియా ఎలకా్ట్రనిక్స్‌ తయారీ దిగ్గజం సామ్‌సంగ్‌ ఆందోళన వ్యక్తం చేసింది. అయినప్పటికీ, వ్యూహాత్మక భాగస్వామ్యాల ద్వా రా చిప్‌ల సరఫరాను కొనసాగించగలుగుతామని ధీమా వ్యక్తం చేసింది. మెమొరీ చిప్‌ల తయారీలో ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీల్లో సామ్‌సంగ్‌ ఒకటి. ప్రస్తుతం మార్కె ట్లో పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తున్నామని సామ్‌సంగ్‌ ఆగ్నేయాసియా అధ్యక్షుడు, సీఈఓ జేబీ పార్క్‌ అన్నారు. మార్కెట్‌ మార్పులకు అనుగుణంగా స్పందించ డం ద్వారా చిప్‌ల ధరల పెరుగుదల ప్రభావాన్ని వీలైనం త తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అయితే, చిప్‌ల కొరత సమస్య వచ్చే ఏడాది వరకు కొనసాగవచ్చన్నారు.ఏఐ డేటా సెంటర్ల నుంచి వీటికి డిమాండ్‌ పెరగడమే ఇందుకు కారణమని పార్క్‌ తెలిపారు.

ఇవి కూడా చదవండి..

ఇరాన్ దిగి వచ్చింది.. కానీ ఇప్పటికే ఆలస్యమైంది: ట్రంప్

ఇరాన్ అధ్యక్ష కార్యాలయంపై దాడి.. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వెల్లడి

Updated Date - Mar 04 , 2026 | 01:20 AM