Share News

Jerome Powell: పోవెల్‌కు సెంట్రల్‌ బ్యాంకర్ల సంఘీభావం

ABN , Publish Date - Jan 14 , 2026 | 05:42 AM

అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పోవెల్‌కు పలు దేశాల కేంద్ర బ్యాంకుల గవర్నర్లు సంఘీభావం ప్రకటించారు...

Jerome Powell: పోవెల్‌కు సెంట్రల్‌ బ్యాంకర్ల సంఘీభావం

ఫ్రాంక్‌ఫర్ట్‌ (జర్మనీ) : అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పోవెల్‌కు పలు దేశాల కేంద్ర బ్యాంకుల గవర్నర్లు సంఘీభావం ప్రకటించారు. గత ఏడాది జూన్‌లో ఫెడరల్‌ రిజర్వ్‌ భవన మరమ్మతుల కోసం పోవెల్‌ పెద్ద మొత్తంలో ఖర్చు చేశారు. ఇందులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ దర్యాప్తునకు ఆదేశించడమేగాక, పోవెల్‌పై అభియోగాలు నమోదు చేస్తామని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు. ఇది ఫెడ్‌ రిజర్వ్‌ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసి తనకు కావలసిన రీతిలో వడ్డీ రేట్లు మార్చుకునేందుకు ట్రంప్‌ వేసిన ఎత్తుగడ అని ఈసీబీ, బ్రిటన్‌, స్వీడన్‌, డెన్మార్క్‌, జర్మనీ, జపాన్‌, కెనడా, స్విట్జర్లాండ్‌ వంటి ప్రధాన దేశాల కేంద్ర బ్యాంకుల గవర్నర్లు దుయ్యబట్టారు.

ఇవీ చదవండి:

అల్‌ ఫలా వర్సిటీ క్యాంపస్‌ అటాచ్‌!

వారాణసీ స్కూళ్లలో తమిళం తరగతులు!

Updated Date - Jan 14 , 2026 | 05:42 AM