డెరివేటివ్స్‌లో ‘జెన్ జీ’ ముందంజ : సెబీ
ABN , Publish Date - Aug 24 , 2026 | 06:03 AM
ఉద్యమాల్లోనే కాదు.. స్టాక్ మార్కెట్ డెరివేటివ్స్ ట్రేడింగ్‌పైనా 30 ఏళ్ల లోపు వయసున్న జెన్ జీ యువత ఆసక్తి చూపిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో డెరివేటివ్స్ ట్రేడింగ్...
న్యూఢిల్లీ : ఉద్యమాల్లోనే కాదు.. స్టాక్ మార్కెట్ డెరివేటివ్స్ ట్రేడింగ్‌పైనా 30 ఏళ్ల లోపు వయసున్న జెన్ జీ యువత ఆసక్తి చూపిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో డెరివేటివ్స్ ట్రేడింగ్ చేసిన రిటైల్ మదుపరుల్లో 30 ఏళ్ల లోపు వయసు ఉన్న జెన్ జీ యువత 43 శాతం వరకు ఉంది. నాలుగేళ్ల క్రితంతో పోలిస్తే ఇది 12 శాతం ఎక్కువ. డెరివేటివ్స్ ట్రేడింగ్ చేసే 60 ఏళ్ల పైబడిన రిటైల్ మదుపరుల్లో గత ఆర్థిక సంవత్సరం 81 శాతం మంది నష్టపోతే, జెన్ జీ యువతలో 89 శాతం మంది నష్టాలు మూటగట్టుకున్నట్టు సెబీ అధ్యయనం తెలిపింది.
ఇతర ప్రధాన అంశాలు
చిన్న చిన్న నగరాల్లోని రిటైల్ మదుపరులకు డెరివేటివ్స్‌పై ఆసక్తి
3/4 వంతు డెరివేటివ్ ట్రేడర్ల వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపే
డెరివేటివ్స్ టర్నోవర్‌లో రూ.5 లక్షల కంటే తక్కువ వార్షికాదాయం ఉన్న వారి వాటా 43%
డెరివేటివ్స్‌లో వచ్చే నష్టాల్లో రూ.5 లక్షల కంటే తక్కువ వార్షికాదాయం ఉన్న వారి వాటా 53%
రూ.5 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్న వారిలో 88 శాతం మందికి డెరివేటివ్స్‌లో నష్టాలు
78% మంది వ్యక్తిగత డెరివేటివ్ ట్రేడర్ల చేతిలో రూ.కోటి కంటే తక్కువ ఈక్విటీ పెట్టుబడులు
గత ఆర్థిక సంవత్సరం 18% తగ్గిన వ్యక్తిగత డెరివేటివ్ ట్రేడర్లు
ఈ వార్తలనూ చదవండి:
అమెరికాలో భారతీయ వ్యాపారి హత్య.. నిందితుడి చిత్రాలు విడుదల..
అమెరికా ఒత్తిడికి తలవంచబోం.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు..