సీఐఐ తెలంగాణ చైర్మన్‌గా గౌతమ్ రెడ్డి
ABN , Publish Date - Mar 08 , 2026 | 03:11 AM
భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) తెలంగాణ చైర్మన్‌గా గౌతమ్ రెడ్డి మేరెడ్డి ఎన్నికయ్యారు. 2026-27 సంవత్సరానికి గాను...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) తెలంగాణ చైర్మన్‌గా గౌతమ్ రెడ్డి మేరెడ్డి ఎన్నికయ్యారు. 2026-27 సంవత్సరానికి గాను ఈయన ఈ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ప్రస్తుతం ఈయన రీ సస్టేనబిలిటీ లిమిటెడ్ (గతంలో రామ్‌కీ ఎన్విరో ఇంజనీర్స్ లిమిటెడ్) వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఎన్విరాన్‌మెంటల్ సర్వీసెస్, వ్యర్ధాల నిర్వహణ, రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాల కల్పనా రంగంలో ఈయనకు 27 ఏళ్ల అనుభవం ఉంది. కాగా చార్టర్డ్ అకౌంటెంట్ గౌరవ్ మహేశ్వరీ వైస్ ప్రెసిడెంట్ నియమితులయ్యారు.
ఇవి కూడా చదవండి
ఈసారైనా గెలవండి.. లేదంటే ఆ చోకర్స్ ట్యాగ్ మీకిచ్చేస్తా: కివీస్‌కు డేల్ స్టెయిన్ వార్నింగ్
ఖమేనీ నలుగురు కొడుకులు క్షేమం.. వెలుగుచూసిన ఫోటోలు