‘ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా’లో మధులాష్,శివగణేశ్
ABN , Publish Date - May 29 , 2026 | 04:39 AM
ఈ ఏడాదికిగాను విడుదలైన ‘ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా’ జాబితాలో ఇద్దరు తెలుగు యువకులకు చోటు దక్కింది. ఎడోధ్వజ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మధులాష్ బాబు...
న్యూఢిల్లీ: ఈ ఏడాదికిగాను విడుదలైన ‘ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా’ జాబితాలో ఇద్దరు తెలుగు యువకులకు చోటు దక్కింది. ఎడోధ్వజ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మధులాష్ బాబు క్రొవ్విడి, జెని5 ఫౌండర్ శివగణేశ్ గడ్డం ఈ లిస్ట్‌లో ఉన్నారు. హైదరాబాద్‌లోని మల్లారెడ్డి విద్యా సంస్థల నుంచి బీటెక్, ఎంబీఏ పూర్తి చేసిన మధులాష్.. పాఠశాల విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కల్పించేందుకు ఎడోధ్వజ ఫౌండేషన్ ద్వారా దేశంలోనే తొలి ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్ (ఫ్లో) బస్‌ను ప్రారంభించారు. ఫ్లో బస్ ఇప్పటివరకు 60,000 గ్రామీణ విద్యార్థులను చేరుకోగలిగిందని మధులాష్ అన్నారు. శివగణేశ్ ప్రారంభించిన ఎడ్యుటెక్ స్టార్టప్ జెని5.. చిన్న పిల్లలకు కామిక్స్ ద్వారా పొదుపు, బడ్జెటింగ్, పెట్టుబడులు, బీమా, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వంటి ఆర్థిక విషయాలపై అవగాహన కల్పిస్తుంది. ఇప్పటివరకు సంస్థ కామిక్స్ లక్ష మందికి పైగా పిల్లలను చేరుకున్నాయని, ఈ ఏడాది 5,400 స్కూల్స్‌లో వీటిని ప్రవేశపెట్టనున్నట్లు శివగణేశ్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
అతిథులకు వరుడి రిటర్న్ గిఫ్ట్.. రూ.34.6 కోట్ల బీమా కవరేజీ..
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే.