ఫుడ్ డెలివరీ సేవల్లోకి ఫ్లిప్‌కార్ట్
ABN , Publish Date - Jul 25 , 2026 | 01:53 AM
వాల్‌మార్ట్ గ్రూప్ పరమైన దేశీయ ఈ-కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్.. ఇక స్విగ్గీ, జొమాటోకు పోటీగా ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ మార్కెట్లోకి సైతం..
న్యూఢిల్లీ: వాల్‌మార్ట్ గ్రూప్ పరమైన దేశీయ ఈ-కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్.. ఇక స్విగ్గీ, జొమాటోకు పోటీగా ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ మార్కెట్లోకి సైతం ప్రవేశించే ఆలోచనలో ఉంది. మరికొద్ది వారాల్లోనే ఫుడ్ డెలివరీ సేవలను ప్రారంభించనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీఈఓ కల్యాణ్ కృష్ణమూర్తి ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. తొలుత ఎంపిక చేసిన ప్రాంతాల్లో సేవలను ప్రారంభించి, ఆ తర్వాత విస్తరిస్తామని ఆయన చెప్పారు. ఇందుకోసం ప్రత్యేక యాప్‌తో పాటు ప్రస్తుత ఫ్లిప్‌కార్ట్ యాప్‌లోనూ ఫుడ్ ఆర్డర్ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు కల్యాణ్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
క్వాంటం వ్యాలీలో మరో కీలక ప్రాజెక్టు