ఫ్లిప్‌కార్ట్‌కు కల్యాణ్ గుడ్‌బై
ABN , Publish Date - Nov 26 , 2026 | 04:48 AM
ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ సీఈఓగా కల్యాణ్ కృష్ణమూర్తి తప్పుకోనున్నారు. సంస్థతో ఆయనుకున్న 11 ఏళ్ల సుదీర్ఘ అనుబంధానికి...
11 ఏళ్ల సారథ్యానికి ముగింపు
తాత్కాలిక సీఈఓగా బాలాజీ త్యాగరాజన్
న్యూఢిల్లీ: ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ సీఈఓగా కల్యాణ్ కృష్ణమూర్తి తప్పుకోనున్నారు. సంస్థతో ఆయనుకున్న 11 ఏళ్ల సుదీర్ఘ అనుబంధానికి తెరపడనుంది. చీఫ్ ప్రొడక్ట్, టెక్నాలజీ ఆఫీసర్‌గా ఉన్న బాలాజీ త్యాగరాజన్‌తోపాటు బోర్డు కంపెనీ నిర్వహణ బాధ్యతలను చూస్తుందని ఫ్లిప్‌కార్ట్ బుధవారం ప్రకటించింది. అయితే, కచ్చితంగా ఎప్పటి నుంచి కల్యాణ్ కృష్ణమూర్తి తప్పుకోనున్నారు? ఆయన రాజీనామాకు కారణాలు ఏంటి? అన్న వివరాలను మాత్రం వెల్లడించలేదు. క్విక్ కామర్స్ సహా కొత్త విభాగాల్లోకి ఫ్లిప్‌కార్ట్ వేగంగా విస్తరిస్తుండటం.. అమెజాన్, మీషో, బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జెప్టో తదితర సంస్థల నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్న తరుణంలో కల్యాణ్ కృష్ణమూర్తి ఫ్లిప్‌కార్ట్‌ను వీడనుండటం గమనార్హం. 2016లో ఫ్లిప్‌కార్ట్‌లో చేరిన కల్యాణ్ కృష్ణమూర్తి.. 2027 జనవరిలో సీఈఓ బాధ్యతలను చేపట్టారు. 2018లో గ్రూప్ సీఈఓ అయ్యారు.
ఇవి కూడా చదవండి:
వైభవ్ వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ కూడా బాదేస్తాడు: చిన్ననాటి కోచ్ మనీశ్ ఓజా
ఐపీఎల్ 2027: వేలంలోకి వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్