Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన సెన్సెక్స్
ABN , Publish Date - Jan 02 , 2026 | 02:15 AM
కొత్త ఏడాది తొలి రోజే దేశీయ స్టాక్ మార్కెట్ మదుపరులను నిరాశ పరిచింది. సెన్సెక్స్ 32 పాయింట్లు నష్టపోయి 85,188.60 వద్ద ముగిసింది. ఉదయం లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్...
ముంబై: కొత్త ఏడాది తొలి రోజే దేశీయ స్టాక్ మార్కెట్ మదుపరులను నిరాశ పరిచింది. సెన్సెక్స్ 32 పాయింట్లు నష్టపోయి 85,188.60 వద్ద ముగిసింది. ఉదయం లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ ట్రేడింగ్ చివర్లో సిగరెట్ కంపెనీలు, ఎఫ్‌ఎంసీజీ కంపెనీల షేర్లలో అమ్మకాల హోరుతో నీరసించింది. అయినా నిఫ్టీ 50 మాత్రం 16.95 పాయింట్ల లాభంతో 26,146.55 వద్ద ముగిసింది. అమ్మకందారులు, కొనుగోలుదారులు ఇంకా హాలీడే మూడ్‌లో ఉండడంతో లావాదేవీల సంఖ్య భారీగా పడిపోయింది.
‘సిగరెట్’ షేర్లు ఢమాల్: ఫిబ్రవరి 1 నుంచి పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం భారీగా పెంచబోతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఐటీసీ, గాడ్‌ఫ్రే ఫిలిప్స్ కంపెనీల షేర్లు కుప్పకూలాయి. ఐటీసీ కంపెనీ షేర్లు 9.69ు నష్టపోయి రూ.363.95 వద్ద ముగిశాయి. దీంతో ఐటీసీ మార్కెట్ క్యాప్ గురువారం ఒక్క రోజే రూ.50,000 కోట్లు తుడిచి పెట్టుకు పోయింది. గాడ్‌ఫ్రే ఫిలిప్స్ కంపెనీ షేర్లయితే ఒక దశలో 19.24ు నష్టపోయి 52 వారాల కనిష్ఠ స్థాయి రూ.2,230.15ని తాకింది. చివరికి 17.09ు నష్టంతో రూ.2,289.65 వద్ద ముగిసింది. ఈ రెండు కౌంటర్లలో మరికొద్ది రోజుల పాటు ఈ దిద్దుబాటు తప్పదని బ్రోకరేజి సంస్థలు చెబుతున్నాయి.
ఇవి కూడా చదవండి
ఆలయ ఈవో వెంకట్రావు రాజీనామా...?
బేకింగ్ సోడా vs బేకింగ్ పౌడర్.. వీటిని ఎప్పుడు ఉపయోగించాలి ?