ద్రవ్య లోటు లక్ష్యం 4.3%
ABN , Publish Date - Feb 02 , 2026 | 06:35 AM
ద్రవ్య క్రమశిక్షణకు పెద్దపీట వేస్తూ ఈ ఏడాది ద్రవ్య లోటు లక్ష్యం జీడీపీలో 4.3 శాతంగా ఆర్థిక మంత్రి నిర్మల ప్రకటించారు. ఈ ఏడాది మార్చితో ముగియనున్న 2025-26 ఆర్థిక...
ద్రవ్య క్రమశిక్షణకు పెద్దపీట వేస్తూ ఈ ఏడాది ద్రవ్య లోటు లక్ష్యం జీడీపీలో 4.3 శాతంగా ఆర్థిక మంత్రి నిర్మల ప్రకటించారు. ఈ ఏడాది మార్చితో ముగియనున్న 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇది 4.4 శాతానికి పరిమితం కానుంది. ప్రభుత్వం సామాజిక బాధ్యతల పట్ల ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండానే విత్తపరమైన లక్ష్యాలను ఎప్పటికప్పుడు సాధిస్తూ వస్తోంది. 2030-31 నాటికి జీడీపీలో రుణాల వాటాను 1 శాతం ఎగువకు లేదా దిగువకు సద్దుబాటు చేసుకునే వెసులుబాటుతో 50 శాతానికి పరిమితం చేయాలనుకుంటున్నాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సర సవరించిన లక్ష్యం 56.1ు కాగా 2026-27 ఆర్థిక సంవత్సరంలో దాన్ని 55.6 శాతానికి తీసుకురావాలనుకుంటున్నాం. జీడీపీలో రుణాల శాతం తగ్గిన కొద్ది అందుబాటులోకి వచ్చే వనరులు ప్రాధాన్యతా రంగాలకు కేటాయించుకునే వెసులుబాటు కలుగుతుందన్నారు.
ఇవీ చదవండి:
ఆ సంస్థలకు 2047 వరకూ ట్యాక్స్ హాలిడే: మంత్రి నిర్మలా సీతారామన్
2019 నుంచి 2026 వరకు.. 9 బడ్జెట్లు.. 14 గంటల ప్రసంగం..