Share News

సెప్టెంబరులో తొలి మేకిన్‌ ఇండియా

ABN , Publish Date - Jan 29 , 2026 | 06:27 AM

తొలి మేకిన్‌ ఇండియా సీ-295 విమానం డెలివరీని చేపట్టనున్నట్లు ఎయిర్‌బస్‌ ఇండియా, దక్షిణాసియా డిఫెన్స్‌, స్పేస్‌ హెడ్‌ వెంకట్‌ కట్కూరి తెలిపారు...

సెప్టెంబరులో తొలి మేకిన్‌ ఇండియా

సీ295 విమానం డెలివరీ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): తొలి మేకిన్‌ ఇండియా సీ-295 విమానం డెలివరీని చేపట్టనున్నట్లు ఎయిర్‌బస్‌ ఇండియా, దక్షిణాసియా డిఫెన్స్‌, స్పేస్‌ హెడ్‌ వెంకట్‌ కట్కూరి తెలిపారు. భారత్‌ నుంచి మొత్తం 56 సీ-295 విమానాలకు ఆర్డర్‌ అందుకోగా అందులో 16 విమానాలను స్పెయిన్‌, సెవెల్లీలోని ఫైనల్‌ అసెంబ్లీ లైన్‌ నుంచి డెలివరీ చేసినట్లు చెప్పారు. కాగా మరో 40 విమానాలను భారత్‌లోనే తయారు చేసి భారత్‌కు అందించాలని నిర్ణయించామన్నారు. టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ (టీఏఎ్‌సఎల్‌)తో కలిసి ఈ విమానాన్ని దేశీయంగా తయారు చేస్తున్నట్లు చెప్పారు. గుజరాత్‌, వడోదరలోని ఎయిర్‌బ్‌స-టాటా సీ-295 ఫైనల్‌ అసెంబ్లీ లైన్‌ (ఎఫ్‌ఏఎల్‌) నుంచి డెలివరీ చేయనున్నట్లు ఆయన తెలిపారు.

ఇవీ చదవండి:

ఈయూతో వాణిజ్య ఒప్పందం.. ఫార్మాకు లాభం.. ఆటోకు కష్టం

నార్త్ బ్లాక్‌లో బడ్జెట్ హల్వా వేడుక.. వారంతా ఐదు రోజుల పాటు అక్కడే..

Updated Date - Jan 29 , 2026 | 06:27 AM