ఉత్పత్తి పెంపునకు ఆటోమొబైల్ కంపెనీలు రెడీ
ABN , Publish Date - Oct 05 , 2026 | 04:49 AM
పండగల సీజన్ సందర్భంగా వాహనాలకు ఏర్పడే డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఆటోమొబైల్ కంపెనీలు ఉత్పత్తిని పెంచడంపై...
న్యూఢిల్లీ: పండగల సీజన్ సందర్భంగా వాహనాలకు ఏర్పడే డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఆటోమొబైల్ కంపెనీలు ఉత్పత్తిని పెంచడంపై దృష్టి సారిస్తున్నాయి. అలాగే డీలర్ల వద్ద నిల్వలను పెంచుతున్నాయి. ఈ సీజన్‌లో ఇబ్బడిముబ్బడిగా పెరిగే బుకింగ్‌లకు అనుగుణంగా వాహనాలు అందుబాటులో ఉండేలా చూడాలని కంపెనీలు భావిస్తున్నాయి. పండగల సీజన్‌కు ముందే మారుతి సుజుకీ ఇండియా (ఎంఎ్‌సఐ) వద్ద 2.2 లక్షల పెండింగ్ బుకింగ్‌లు ఉన్నాయి. ఇందుకు అనుగుణంగానే కంపెనీ ఇప్పటికే రెండు కొత్త ఉత్పత్తి లైన్లను ప్రారంభించిందని, దీంతో ఉత్పత్తి సామర్థ్యం 5 లక్షల యూనిట్లు పెరిగిందని ఎంఎ్‌సఐ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ తెలిపారు. కాగా హ్యుండయ్ ఇండియా తన డీలర్ నెట్‌వర్క్‌వ్యాప్తంగా సరిపడా ఇన్వెంటరీని సిద్ధం చేసిందని సంస్థ ఎండీ, సీఈఓ తరుణ్ గార్గ్ వెల్లడించారు. ఇక మహీంద్రా అండ్ మహీంద్రా సరఫరాను మెరుగుపరిచి వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించడానికి తన యుటిలిటీ వెహికిల్, ఎలక్ర్టిక్ వాహన తయారీ సామర్థ్యాన్ని నెలకు 68,000 యూనిట్లకు పెంచిందని సంస్థ ఆటోమోటివ్ డివిజన్ సీఈఓ నళినికాంత్ గొల్లగుంట తెలిపారు.
ఇవి కూడా చదవండి:
కోల్‌కతాలో బ్రెజిల్ ఫుట్‌బాల్ ఫీవర్.. భారత్‌తో మ్యాచ్‌కు సాల్ట్ లేక్ స్టేడియం సిద్ధం
ఆసియా క్రీడల్లో భారత్ సత్తా.. మలేషియాపై 5-1 ఘన విజయం, హాకీలో స్వర్ణం..