షాకింగ్.. పెరగనున్న గృహోపకరణాల ధరలు!
ABN , Publish Date - Sep 27 , 2026 | 06:12 PM
పండుగల వేళ వినియోగదారులకు గృహోపకరణాల ధరలు మరింత ప్రియం కాబోతున్నాయి. అక్టోబర్ నుంచి ఏసీలు, టీవీ, తదితర ఎలక్ట్రానిక్స్ వస్తువుల ధరలు 8 శాతం వరకు పెరగనున్నట్టు తెలుస్తోంది. దీనికి రాగి, స్టీల్ ధరల ప్రభావం కారణంగా తెలుస్తోంది.
ఆంధ్రజ్యోతి, సెప్టెంబర్ 27: పండుగల సీజన్లో వినియోగదారులకు గృహోపకరణాల ధరలు షాకివ్వబోతున్నాయి. అక్టోబర్ నుంచి ఏసీలు, టీవీ, తదితర ఎలక్ట్రానిక్స్ వస్తువుల ధరలు 8 శాతం వరకు పెరగనున్నట్టు తెలుస్తోంది. దీనికి రాగి, స్టీల్ ధరల పెరుగుదల ప్రభావం కారణంగా చెబుతున్నారు. అక్టోబర్ 1 నుంచి ఎయిర్ కండిషనర్లు (ACs), టీవీలు, వాషింగ్ మెషీన్లు, ఫ్రిజ్‌ల ధరలు 3% నుంచి 8% వరకు పెరగే అవకాశం ఉంది.
అంతర్జాతీయంగా రాగి (Copper), ఉక్కు (Steel), ప్లాస్టిక్ వంటి ముడి సరుకుల ధరలు విపరీతంగా పెరగడమే ఈ ధరల పెంపునకు ప్రధాన కారణం. ముఖ్యంగా ఏసీల తయారీకి కీలకమైన రాగి ధరలు ఏకంగా 25-35శాతం వరకు పెరిగాయి.
పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని పాత స్టాక్ అందుబాటులో ఉన్నందున, దసరా, దీపావళి వరకు రిటైల్ ధరల్లో పెద్దగా మార్పు ఉండకపోయే అవకాశం ఉంది. కొత్త ధరలు దీపావళి పూర్తయిన తర్వాత పూర్తిగా అమల్లోకి రానున్నాయి.
ప్రముఖ బ్రాండ్ల నిర్ణయాలు
బ్లూ స్టార్ (Blue Star): ఏసీలు, డీప్ ఫ్రీజర్ల ధరలను ఇప్పటికే 5-8శాతం పెంచింది.
హైయర్ (Haier): అక్టోబర్ 1 నుంచి రూమ్ ఏసీలపై 5శాతం, టీవీలు, వాషింగ్ మెషీన్లపై 2-3శాతం ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది.
డైకిన్ (Daikin): సెప్టెంబర్ 16 నుంచి 8-10శాతం ధరలను పెంచింది.
గాద్రెజ్ (Godrej): 5-7శాతం ధరల పెంపు తప్పదని స్పష్టం చేసింది.
పానాసోనిక్ (Panasonic): పరిస్థితులను పరిశీలిస్తున్నామని, త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి
రాహుల్ ఆరోపణలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
భూ సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యం: మంత్రి పొంగులేటి