Share News

మళ్లీ ధరల మంట

ABN , Publish Date - Mar 13 , 2026 | 02:32 AM

మళ్లీ ఆహార ధాన్యాల ధరలు సుర్రుమంటున్నాయి. ఆహార వస్తువుల ధరల పెరుగుదల ప్రభావంతో ఫిబ్రవరి నెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 3.21 శాతానికి ఎగబాకింది. జనవరి నెలలో ఇది...

మళ్లీ ధరల మంట

ఫిబ్రవరిలో ద్రవ్యోల్బణం 3.21%

న్యూఢిల్లీ: మళ్లీ ఆహార ధాన్యాల ధరలు సుర్రుమంటున్నాయి. ఆహార వస్తువుల ధరల పెరుగుదల ప్రభావంతో ఫిబ్రవరి నెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 3.21 శాతానికి ఎగబాకింది. జనవరి నెలలో ఇది 2.74 శాతంగా ఉంది. అయినప్పటికీ ద్రవ్యోల్బణం భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) కు ప్రభుత్వం నిర్దేశించిన 2-4 శాతం (2 శాతం ఎగువకు లేదా దిగువకు సద్దుబాటు చేసుకునే వెసులుబాటుతో) కట్టడి పరిధిలోనే ఉంది. ఫిబ్రవరి గణాంకాలు ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన కొత్త సిరీస్‌ (2024 ఆధారిత సంవత్సరం) ఆధారంగా ఉన్నాయి. ఫిబ్రవరిలో ఆహార వస్తువుల ధరలు 2.13ు నుంచి 3.47 శాతానికి పెరిగాయి. ఫిబ్రవరిలో కొబ్బరి, టమాటా, కాలీ ఫ్లవర్‌ వంటి కూరగాయల ధరలు గణనీయంగా పెరిగాయి. ప్రాంతాలవారీగా చూస్తే రిటైల్‌ ద్రవ్యోల్బణం గ్రామీణ ప్రాంతాల్లో 3.37 శాతం, పట్టణ ప్రాంతాల్లో 3.02 శాతంగా ఉంది.

తెలంగాణలో అత్యధికం

ప్రాంతాల వారీగా చూసినట్టయితే ద్రవ్యోల్బణం తెలంగాణలో అత్యధికంగా 5.02 శాతం ఉంది. మిజోరంలో అతి తక్కువ ద్రవ్యోల్బణం 0.1 శాతం నమోదైంది.

ఇవి కూడా చదవండి..

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే

ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలు.. కూతురితో కలిసి వీక్షించిన కిమ్..

Updated Date - Mar 13 , 2026 | 02:32 AM