ఎఫ్‌డీలపై మరింత వడ్డీ
ABN , Publish Date - Oct 08 , 2026 | 01:42 AM
రెపో రేటు పెంపు రిటైల్ రుణ గ్రహీతలపై అదనపు భారం మోపినా.. ఫిక్స్‌డ్ డిపాజిటర్ల (ఎఫ్‌డీ)కు మాత్రం మరింత మేలు చేయనుంది...
రెపో రేటు పెంపు రిటైల్ రుణ గ్రహీతలపై అదనపు భారం మోపినా.. ఫిక్స్‌డ్ డిపాజిటర్ల (ఎఫ్‌డీ)కు మాత్రం మరింత మేలు చేయనుంది. బ్యాంకులు, ఎన్‌బీఎ్‌ఫసీలు ఎఫ్‌డీలపై చెల్లించే వడ్డీ రేట్లను పెంచనున్నాయి. ఆర్‌బీఐ నిర్ణయం వెలువడిన వెంటనే బజాజ్ ఫైనాన్స్ తన ఎఫ్‌డీలపై చెల్లించే వడ్డీ రేట్లను 0.15 శాతం నుంచి 0.4 శాతం పెంచుతున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం బ్యాంకులు ఎఫ్‌డీలపై ఎఫ్‌డీ మొత్తం, కాలపరిమితిని బట్టి 6.6 శాతం నుంచి 7 శాతం వరకు వడ్డీ చెల్లిస్తున్నాయి. అయితే అనేక బ్యాంకులు ప్రస్తుతం ఎఫ్‌సీఎన్‌ఆర్(బీ) డిపాజిట్ల పుణ్యమాని మిగులు నిధులతో సతమతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకులు రెపో రేటు పెంపునకు అనుగుణంగా ఎఫ్‌డీ వడ్డీ రేట్లు పెంచుతాయా? లేదా? అనేది పెద్ద ప్రశ్న.
ఇవి కూడా చదవండి:
ఇకపై సెలక్షన్ కమిటీ భేటీలకు వీవీఎస్ లక్ష్మణ్: బీసీసీఐ
తీవ్ర విషాదం.. విషవాయువు పీల్చి నలుగురు విద్యార్థుల మృతి