Share News

India Silver Import Policy: వెండి దిగుమతుల విధానం మారాలి

ABN , Publish Date - Jan 08 , 2026 | 06:32 AM

మన దేశ వెండి దిగుమతుల విధానం మారాలని నిపుణులు కోరుతున్నారు. నేరుగా శుద్ధి చేసిన వెండికి బదులు, వెండి ఖనిజాన్ని దిగుమతి చేసుకుని శుద్ధి చేసి, దాన్ని వివిధ ఉత్పత్తుల రూపంలో ఎగుమతి...

India Silver Import Policy: వెండి దిగుమతుల విధానం మారాలి

ఈ విషయంలో చైనా విధానమే బేష్‌: జీటీఆర్‌ఐ

న్యూఢిల్లీ: మన దేశ వెండి దిగుమతుల విధానం మారాలని నిపుణులు కోరుతున్నారు. నేరుగా శుద్ధి చేసిన వెండికి బదులు, వెండి ఖనిజాన్ని దిగుమతి చేసుకుని శుద్ధి చేసి, దాన్ని వివిధ ఉత్పత్తుల రూపంలో ఎగుమతి చేయడంపై దృష్టి పెట్టాలని గ్లోబల్‌ ట్రేడ్‌ రీసెర్చి ఇనిస్టిట్యూట్‌ (జీటీఆర్‌ఐ) సూచించింది. చైనా ఇప్పటికే ఇలాంటి విధానాన్ని అనుసరిస్తున్న విషయాన్ని గుర్తు చేసింది. 2024లో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు 630 కోట్ల డాలర్ల విలువైన వెండి ఖనిజాన్ని దిగుమతి చేసుకుంటే అందులో చైనా వాటానే 560 కోట్ల డాలర్ల వరకు ఉందని తెలిపింది. చైనా ఈ ఖనిజాన్ని శుద్ధి చేసి వెండిగా మార్చి ఎలకా్ట్రనిక్స్‌, వైద్య పరికరాలు, సోలార్‌ ప్యానెళ్ల తయారీలో ప్రధాన ముడి సరుకుగా మార్చి పెద్ద ఎత్తున విలువ జోడిస్తోందని పేర్కొంది. వెండి పారిశ్రామిక, ఇంధన రంగాల్లో కీలక ముడి వస్తువుగా మారిన ప్రస్తు త నేపథ్యంలో భారత్‌ తన వెండి దిగుమతి విధానాన్ని మార్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని జీటీఆర్‌ఐ తెలిపింది. విదేశాల్లో వెండి ఖనిజ నిక్షేపాలున్న గనులు సంపాదించడం, దేశంలో వెండి ఖనిజ శుద్ధి, పాత వెండి వస్తువుల రీసైక్లింగ్‌ సామర్ధ్యాలు పెంచుకోవడం ద్వారా దిగుమతులపై అధిక ఆధారనీయతను తగ్గించ

ఇవి కూడా చదవండి..

వెనెజువెలా మాజీ అధ్యక్షుడు మదురోకు గాయాలయ్యాయా.. వీడియో చూస్తే..

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jan 08 , 2026 | 06:32 AM