వచ్చే ఐదేళ్లలో 8-10 కొత్త ట్రాక్టర్లు
ABN , Publish Date - Mar 04 , 2026 | 01:25 AM
ఎస్కార్ట్స్ కుబోటా.. దక్షిణాది రాష్ట్రాల కోసం ప్రత్యేకంగా పవర్‌ట్రాక్ శౌర్య ట్రాక్టర్‌ను తీసుకువచ్చింది. సౌత్ స్పెషల్ ప్యాడీ ట్రాక్టర్ సిరీ్‌సతో దీన్ని తీసుకువచ్చినట్లు సంస్థ సీఎండీ నిఖిల్ నందా...
మార్కెట్లోకి పవర్‌ట్రాక్ శౌర్య ట్రాక్టర్
దక్షిణాది రాష్ట్రాల కోసం ప్రత్యేకంగా తయారీ
ఎస్కార్ట్స్ కుబోటా సీఎండీ నిఖిల్ నందా
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఎస్కార్ట్స్ కుబోటా.. దక్షిణాది రాష్ట్రాల కోసం ప్రత్యేకంగా పవర్‌ట్రాక్ శౌర్య ట్రాక్టర్‌ను తీసుకువచ్చింది. సౌత్ స్పెషల్ ప్యాడీ ట్రాక్టర్ సిరీ్‌సతో దీన్ని తీసుకువచ్చినట్లు సంస్థ సీఎండీ నిఖిల్ నందా తెలిపారు. మంగళవారం నాడిక్కడ మార్కెట్లోకి ఈ ట్రాక్టర్ విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరి సాగులో కీలకంగా ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల కోసం శౌర్య సిరీస్ ట్రాక్టర్‌ను రూపొందించినట్లు చెప్పారు. వరి సాగుకు సంబంధించి అన్ని రకాలైన భూములకు ఈ ట్రాక్టర్ సమర్ధవంతంగా పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. 39 హెచ్‌పీ నుంచి 52 హెచ్‌పీ శ్రేణిలో అందుబాటులో ఉండనున్న ఈ ట్రాక్టర్ ధరల శ్రేణి రూ.5.75 లక్షల నుంచి రూ.7.30 లక్షల (ఎక్స్‌షోరూమ్) మధ్యన ఉండనున్నాయని నందా తెలిపారు. రానున్న 4-5 నెలల్లో మరొక ట్రాక్టర్‌ను దక్షిణాది మార్కెట్లోకి తీసుకురానున్నట్లు ఆయన చెప్పారు. కాగా కంపెనీ ప్రస్తుతం పవర్‌ట్రాక్, ఫార్మ్‌ట్రాక్, కుబోటా బ్రాండ్స్‌తో ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ పరికరాలను తయారు చేస్తోందన్నారు. అంతేకాకుండా వచ్చే ఐదేళ్లలో ఈ మూడు బ్రాండ్స్‌లో కొత్తగా 8 నుంచి 10 ఉత్పత్తులు మార్కెట్లోకి తీసుకురావాలని చూస్తున్నట్లు నందా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంస్థ డిప్యూటీ ఎండీ అకీరా కాటో, సీఎ్‌ఫఓ భరత్ మదన్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఇరాన్ దిగి వచ్చింది.. కానీ ఇప్పటికే ఆలస్యమైంది: ట్రంప్
ఇరాన్ అధ్యక్ష కార్యాలయంపై దాడి.. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వెల్లడి